వేసవిలో అందంగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం...  మండే ఎండల్లో చర్మాన్ని సంరక్షించడం చాలా అవసరమని బ్యూటీషన్లు అంటున్నారు. వేసవిలో చర్మ సంరక్షణపై శ్రద్ధ తీసుకోకపోతే.. చర్మ సమస్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. 

వేసవిలో చెమటలు పట్టడం సహజం. దీంతో చెమటకాయలు, మొటిమలు రావడం, చర్మం పొడిబారడం జరుగుతుంది. అందుచేత సమ్మర్లో కూడా మెరవాలంటే ఈ అందమైన  చిట్కాలు పాటించాల్సిందేనని బ్యూటీషన్లు అంటున్నారు. 

 ఎండకాలంలో కూడా మీ చర్మం మిలమిలమెరిసిపోవాలంటే.. పాలుతో కాస్త నిమ్మరసం చేర్చి ముఖానికి పట్టించి, పది నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే మీ చర్మం పొడిబారకుండా ఉంటుంది. అయితే మొటిమలుండే వారు దీనిని ఫాలో చేయకుండా ఉంటే మంచిది. 

వేసవిలో చెమట దుర్గంధానికి చెక్ పెట్టాలంటే.. గంధాన్ని పనీర్‌‌తో కలిపి శరీరానికి రాసుకుని స్నానం చేస్తే సరిపోతుంది. అలాగే వేసవిలో గోల్డ్ ప్లేటెడ్ ఆభరణాలు ఉపయోగించే వారు కాస్త జాగ్రత్తలు పాటించాలి. మెడ భాగంలో నల్లబడితే ఓట్స్, గోధుమపిండిని పాలతో కలిపి మెడకు పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. 

అలాగే చెమటకాయల నుంచి ఉపశమనం పొందాలంటే నీటిలో చందనాన్ని కలిపి రాసుకుంటే సరిపోతుంది. అలాగే బొప్పాయి గుజ్జును ముఖానికి రాసుకుంటే వేసవిలో చర్మం మృదువుగా ఉంటుంది. ఇంకా పొటాటో, కీర దోసకాయల్ని కట్ చేసి కంటిపై కంటి వలయాలను దూరం చేసుకోవచ్చు. పుచ్చకాయ గుజ్జును ముఖం, శరీరం, చేతులు, కాళ్ళకు పట్టిస్తే చర్మంలో ముడతలకు చెక్ పెట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: