వేసవికాలంలో చర్మాన్ని చాలా పదిలంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో వేడి అధికంగా ఉండడం వల్ల చర్మ సౌందర్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.


ఒక అరటి పండులో సగం తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రపరచినట్లైతే ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

 టమాటా, నిమ్మరసంతో ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మంపై జిడ్డు పూర్తిగా వదిలిపోతుంది. అంతేకాదు ముఖంపై ఉన్న బ్లాక్‌హెడ్స్ కూడా తగ్గిపోతాయి. ముఖంపై ర్యాషెస్ లేదా మొటిమలు ఉంటే మాత్రం నిమ్మరసాన్ని ఉపయోగించవద్దు.

 ప్రతిరోజూ నిద్రించే ముందు పేరిన నెయ్యి లేదా తాజా వెన్నను రాసుకుంటే పెదవులు మృదువుగా మారుతాయి. విటమిన్ ఇ సుగుణాలున్న లిప్‌స్టిక్‌ను వాడితే, పెదవులు ఆరోగ్యంగా కనిపిస్తాయి.

 అరకప్పు నిమ్మరసంలో కొద్దిగా పంచదార కలిపి చేతులకు పట్టించాలి. మృతచర్మం పోయి చేతులు అందంగా కనిపిస్తాయి.

 గోళ్లకు కొద్దిగా ఆలివ్‌నునెను రాసి మర్దన చేస్తే ఆరోగ్యంగా కనిపిస్తాయి.

 స్నానం చేసే నీటిలో మూడు నాలుగు చుక్కలు గంధం లేదా గులాబీ నూనె వేసుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.

 వారానికి ఒక్కసారైనా చర్మానికి ఆలివ్, లేదా కొబ్బరినూనెను రాసుకుని అరగంటయ్యాక సున్నిపిండి, పాలతో కలిపి నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చర్మం ఎంతో అందంగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: