ఎండాకాలంలో ీవీలైనంత వరకు కాటన్ బ్రెసియర్లు ధరించడం మంచిది. ఇవి చెమటను పీల్చుకుంటాయి. కాబట్టి అసౌకర్యంగా ఉండదు. ఐతే శీతాకాలంలో 
సాటిన్ క్లాత్ తో రూపొందించినవి ధరిస్తే చలినుంచి కాపాడుకోవచ్చు. ఏది ఏమైనా రోజులో ఎక్కువసేపు బ్రేసియర్ ధరించే వారు కాటన్ బ్రా వాడటం మంచిది.

డ్రస్ ను బట్టి మనం ధరించే దుస్తులకు అనుగుణంగా బ్రేసియర్ ఎంపిక ఉంటే బాగుంటుంది. టీనేజర్లు సాధారణంగా చుడీదార్లు, జీన్స్ వంటి ధరిస్తారు. ధరించే దుస్తులకు అనుకూలంగా ఉండడానికి కొన్ని కంపెనీలు బ్రా తయారీలో శ్రద్ద తీసుకుంటున్నాయి. స్కూళ్ళకి, కాలేజీకి వెళ్లే వారికి స్పోర్ట్స్ బ్రా అనుకూలంగా ఉంటుంది. స్ట్రావ్స్ ఉన్న బ్రాలు మధ్యలో ఊడిపోయి అసౌకర్యాన్ని కలిగజేస్తాయి. అదే స్పోర్ట్స్ బ్రా అయితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు.

చీరకట్టుకునే వారికి స్ట్రాప్స్ బ్రా బెస్ట్:
వెనుక భాగం కనిపించేలా బ్రాడ్ నెక్స్ దరించేవారు స్ట్రాప్ లెస్ బ్రేసియర్లు వాడటం మంచిది. అదే మామూలుగా జాకెట్లు ధరిస్తే స్ట్రాప్స్ బ్రా దరించటం మంచిది.

గర్భిణీలకు :
గర్భం దాల్చినప్పుడు  వక్షోజాల ఆకారంలో మార్పు వస్తుంది. వక్షోజాల పరిమాణం పెరుగుతుంది. బరువెక్కుతాయి కూడా ఇలాంటప్పుడు వక్షోజాల బరువుకి సపోర్టునిచ్చి బ్రేసియర్ ధరించడమే మంచిది. అయితే ఇంతకుముందు వాడుతున్న సైజు కాకుండా టేప్ తో కొలుచుకుని కొంచెం పెద్ద సైజు బ్రెసియర్ కొనుక్కోవడం మంచిది.

హెవీ బ్రెస్ట్ నెక్ లైన్స్:
హెవీ బ్రెస్ట్ వారు అందునా భుజాలు వెడల్పుగా ఉన్నవారు  రౌండ్ కానీ వి నెక్స్ కాని ధరిస్తే మంచిది.

బ్రెస్ట్ కేర్ :
వక్షోజా ఆకారం చక్కగా ఉండాలంటే వ్యాయామం చెయ్యడం తప్పనిసరి. అలాగే స్నానం చేసేటప్పుడు చన్నీళ్లని దారగా వక్షోజాల మీద పోసుకోవాలి. ఇలా చేస్తే రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇకపోతే నెలసరి ముందు కొందరు వక్షోజాల సలుపుతో బాధపడతుంటారు. ఇలాంటప్పుడు ముందుగా ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాలి. శాట్యురేటడ్ ఫ్యాట్స్,  స్వీట్స్ తినడం తగ్గించాలి. కాఫీ, టీలు తక్కువగా తాగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: