వేసవిలో పొడి చర్మం ఉన్నవారికి అంతగా ఇబ్బంది ఉండదు కానీ జిడ్డు చర్మత్వం ఉన్నవారికి మాత్రం నరకమే. ఎండకి ముఖం మీద జిడ్డు మరింతగా పట్టేసి, తాజాదనం కొంచెమైనా కనిపించదు. అయితే ఈ ఇబ్బంది లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఈ పరిస్థితి నుంచి బయటపడొచ్చు వీలైనంత వరకూ ఎండ ప్రభావం ఎక్కువగా పడకుండా చూసుకోవాలి. జిడ్డు పడుతుంది కదా అని గంట గంటకీ ముఖం కడిగేయకండి. దీనివల్ల చర్మంపై ఉన్న తేమ మొత్తం పోతుంది. ఎండలో బయటకు వెళ్లి ఇంటకి చేరగానే ఐస్ క్యూబ్ లతో ముఖాన్ని రుద్దండి.

 ముఖానికి క్రీంల వాడకం బాగా తగ్గించాలి. ఆయిల్ ఫ్రీ ఉత్పత్తులనే ఎంచుకోవాలి. మరీ అవసరమైతే తప్ప మేకప్ వేసుకోవడమే మంచిది. జిడ్డు చర్మతత్వం ఉన్న వారికి మొటిమలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. షౌండేషన్ లాంటివి ఎక్కువగా రాసుకుంటే చర్మ రంద్రాలు మూసుకుపోయి మొటిమలు మరింత పెరుగుతాయి. అందుకే ముఖానికి మామూలు పౌడర్, కన్సీలర్ రాసుకుని, మిగతా వాటికి దూరంగా ఉంటే మంచిది.

ఈసమయంలో చర్మం తాజాగా కనిపించేలా చేయాలంటే గంధం ప్యాక్ ని ప్రయత్నించాలి. రెండు చెంచాల గంధంపొడిని తీసుకొని నీళ్ళతో మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని ముఖం నుంచి మెడవరకూ పూతలా వేసుకొని పదినిమిషాల తరువాత కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మొటిమలూ, ముడతలూ రాకుండా ఉంటాయి. చర్మంపై పేరుకున్న అధిక జిడ్డు తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: