అతివ అందానికి ఆరోగ్యానికి అద్దంపడతాయి గోళ్ళు, గోళ్ళను సంరక్షించుకుని ఆరోగ్యంగా ఉంచుకోకపోతే ఎలాంటి నెయిల్ పాలిష్ తోనూ ఉపయోగం ఉండదు. చేతివేళ్ళు, గోళ్ళు సంరక్షణను మేనిక్యూర్ అంటారు. బలహీనమైన, పెళుసుబారిన గోళ్ళకు మేనిక్యూర్ వలన అంతగా ఫలితం ఉండదు.

కానీ గోళ్ళు చీలడం, విరగడం, చారలు ఏర్పడడం వంటి వాటిని మేనిక్యూర్ తో కప్పిపుచ్చుకోవచ్చు. గోళ్ళు కురుచుగా ఉన్నా కొరకడం విరిగిపోవడం వల్ల, పొట్టిగా తయారైన వాటిని ప్లోర్సెలియిన్ తో పొడవుగా రూపొందించుకోవాడానికి మెటల్ నెయిల్స్ ను ఉపయోగిస్తారు. ఫ్లోర్సేలెయిన్ సెట్ అయిన తరువాత ఆ మెటల్ లెయిన్స్ ను తీసివేస్తారు. పోరెసెలెయిన్ నెయిల్స్ నెయిల్ ఫాలిష్ ను బాగా పట్టి ఉంచుతాయి.

1. పాలు, పెరుగుతో కూడిన కాల్సియం సమృద్దిగా గల  ఆహారం తీసుకోండి.

2. గోళ్లకు సంబందించి ఎలాంటి ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చినా వెంటనే డాక్టర్లును సంప్రదించాలి. అది పూర్తిగా తగ్గిపోయేవరకు నెయిల్ పాలిష్ వేసుకోకూడదు.

3.. గోళ్ళు గట్టిపడటానికి, చక్కని ఎదుగుదలకు, గోళ్లను రోజుమార్చి నులివెచ్చని బేబీ అయిల్ లేదా ఆలివ్ ఆయిల్ తో పది నిముషాలపాటు నానబెట్టుకోవాలి.

4. గోరు మూలం వద్ద వేడి నూనెతె మసాజు చేయడం వలన నెయిల్ బెడ్ ప్రాంతానికి రక్త ప్రసరణను వృద్ది పరుస్తుంది. దీనితో నెయిల్స్ రూట్ ఆరోగ్యంగా ఉంటుంది.

5. రంగు కోల్పోయిన నెయిల్స్ పై హైడ్రోజన్ పెరాక్సెడ్ లో ముంచిన దూదితో తుడిస్తే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: