సర్వరోగ నివారిణియే కాదు అతివల అందాలకు సౌందర్య సాధనంగా పనిచేస్తుంది. చింతచిగురు. ఎలాగో తెలసుకోవాలని ఉందా...
చింత చిగురు పప్పులో వాడడం వల్ల ఎన్నో రోగాలు నయం అవుతాయి బెణుకులకు, పాత నొప్పులకు చింతచిగురు దివ్య ఔషధంలా పనిచే్స్తేంది. చింతచిగురు బెల్లంతో నూరి నొప్పులున్న చోట పట్టువేసినట్లయితే నొప్పులు తగ్గిపోతాయి. రక్తహీనత సమయంలో చింతచిగురు వంటలు ఇంగ్లీష్ మందుల్లా పనిచేస్తాయి. చింతచిగురు కూర కీళ్ల నొప్పులు నివారణకు ఎంతగానో పనిచేస్తుంది.

సౌందర్య సాధనం :
అంతేకాదు సౌందర్య పోషణకు కూడా ఒక సాధనంలా పనిచే్స్తుంది చింతచిగురు. చింతచిగురు ను కొబ్బరిపాలలో కలిపి బాగా నూరి దానిలో పసుపు. పచ్చ కర్ఫూరాన్ని కలుపుకున్నట్లయితే అది పేస్టుగా మారుతుంది. ఆ పేస్టును ఓ ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరచుకుని ముఖంపైన మొటిమలు గాని, మచ్చలుగాని ఉన్నట్లయితే  ఆ పేస్టును ముఖానికి పూసి అరగంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. పై విధంగా చేసినట్లయితే ముఖం ఎంతో అందంగానూ, ఆకర్షణీయంగా తయారవుతుంది. ఇలా పది, పదిహేను రోజులు చేసినట్లయితే ముఖంపై మొటిమలు, మచ్చలు మటుమాయం అవుతాయి. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న చింతచిగురును కూడా వండుకోండి. ఆరోగ్యానికి చింతచిగురు  చేసే మేలేమిటో స్వయంగా తెలుసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: