‘‘మేధికా కటురష్ణా చ రక్తపిత్తప్రకోపనీ !

అరోచక హరా దీప్తికరీ వాత ప్రణాశినీ !!

 మెంతుల గురించి క్రీస్తుపూర్వం నాటి దన్వంతర నిఘంటువు మెంతులు గురించి వివరించింది.  మెంతులు కొంచెం చేదుగా వుంటాయి.  వేడి చేస్తాయి. రక్తపోటును పెంచుతాయి. కానీ నోటికి రుచిని కల్గించి, తన్నది అరిగించి, వాతాన్ని తగ్గించి మేలు చేస్తాయి అవి ఈ నిఘంటుకారుని భావం.

మెంతులు ఆడవారికి మంచి నేస్తాలు

సాధారణంగా పొలాల్లో పండే వాటికన్నా అడవుల్లో సహజసద్ధంగా పెరిగే మూలికలు ఎక్కువ శక్తవంతంగా వుంటాయి.  కానీ, అడవి మెంతుల కన్నా, మన రైతులు పండించే మెంతులే ఎక్కువ శక్తివంతమైనవని ‘భావప్రకాశ’ వైద్య గ్రంధంలో పేర్కొన్నారు.  అదే విధంగా అడవి మెంతులు గుర్రాలకు మేలు చేస్తాయి.

ఆవకాయలాగే ఆవపిండికి బదులుగా మెంతి పిండిని వేసి ‘మెంతికాయ’ ని చేయడం తెలుగు వారి అలవాటు.  ఆవాల కన్నా మెంతులు తక్కువ వేడిచేస్తాయి. అందుకే రుచిలో ఆవకాయకు ఏమీ తీసుపోదు కాబట్టి మెంతికాయను ఎక్కువ వాడుకున్నా పరవాలేదు.  మెంతికూర పప్పు, మెంతి మజ్జిక, మెంతి పెరుగు ఇలాంటి వంటలు చేయడంలో మహిళలు ఆరితేరి పోయారు.  ఇవి ఆరోగ్యానికి వరప్రసాదమే కాకుండా రుచి, సుచి..

మెంతుల్లో విలమిన్లూ, ఖనిజాలు పుష్కలం

మెంతి గింజలూ, మెంతి ఆకులు కూడా సమానమైన శక్తికలవే ! గడ్డకట్టి రాయిలా వున్న శరీరంలో ఏ భాగాన్నయినా మృదువు పరిచే శక్తి మెంతులకు, మెంతికూరకూ సమానంగానే వుందని ఆయూర్వేద గ్రంథాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా ‘‘లైసిన్’’ అనే ప్రోటీన్లకు సంబంధించిన ప్రాధమికమైన అమైనో ఆమ్లం వుంది.  మెంతికూరలో బి కాంప్లెక్స్ తదితర పోషక పదార్ధాలు అమితంగా వున్నాయి. మెంతుల్లో ఫాస్పరిక్ ఆమ్లం, ఆరు శాతం రెసిన్ అనే తైలం వున్నాయి.   కాబట్టి మెంతికూరని ఎంత తరచుగా తీసుకోవవాలని మనకు అర్ధం అవుతున్నది. అయితే అదే పనిగా, అతిగా తినకూడదు .. దీని వల్ల పైత్య వికారం, తలనొప్పి, తలతిరుగుడు వస్తాయి. దీనికి విరుగుడు పుల్లదానిమ్మ.

మెంతుల్లొ పోషక విలువలు

తేమ :  86.1‌%                      ఖనిజాలు, విటమిన్లు

మాంసకృతులు : 4.4%              కాల్షియం : 395  (Mg)

క్రొవ్వు : 0.9%                       ఫాస్పరస్ : 51 (Mg)

ఖనిజాలు విటమిన్లు : 1.5%         సి.విటమిన్ : (Mg)

నార  : 1.1%                          బి.కాంప్లెక్స్ : కొద్దిగా

పిండిపదార్ధాలు : 6.0                మొత్తం కేలరిక్ విలువ : 49

మరింత సమాచారం తెలుసుకోండి: