ప్రపంచంలో అందమైన ముఖం కావాలని ఎవ్వరైనా అనుకుంటారు.  అయితే కొంత మంది అందం కోసం నానా తంటాలు పడుతుంటారు. ముఖ్యంగా అందాన్ని మెరుగు పర్చుకోవడానికి చాలా మంది బ్యూటీ పార్లర్ ను ఆశ్రయిస్తుంటారు.  కానీ ప్రాచీన కాలంలో మహిళలు తమ అందాన్ని కాపాడుకోవడం కోసం ఆయుర్వేదం..ఇంట్లో దొరికే ఔషదాలనే వాడే వారు.


ముఖ లావణ్యం కోసం ఒక టమోటాను గింజలు, తొక్క విడదీసి గుజ్జును మాత్రమే తీసుకోవాలి. అందులో రెండు టీ స్పూన్ల పెరుగు, ఒక టీ స్పూన్ కీరకాయ గుజ్జు, మూడు టీ స్పూన్ల ఓటమిల్ సైడర్, మూడు పుదీనా ఆకులు వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి. ఐదు నిమిషాల తర్వాత వేడినీటితో కడగాలి.


ఈ ఫ్యాక్ వారానికి ఒకసారైనా వేస్తుంటే మఖ లావణ్యం, తగ్గకుండా ఉంటుంది. జిడ్డు చర్మానికి బాగా పని చేస్తుంది. అదనపు జిడ్డును తొలగించడంతోపాటు టమోటాలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి. పెరుగు చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: