వేసవికాలం అనగానే గుర్తుకు వచ్చే పండ్లల్లో ఒకటి పుచ్చపండు... ఎండల్లో చర్మం వడదెబ్బ బారినపడి కమిలిపోకుండా రక్షిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అంతే కాదు ఇందులో బ్యూటీ మరియు స్కిన్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి.  1. నేచురల్ టోనర్: ఈ ఎర్రని, జ్యూసీ ఫ్రూట్ నేచురల్ ఆస్ట్రిజెంట్ చర్మం రంగును మార్చుతుంది. అందుకు ఈ కర్జూజ గుజ్జును ముఖానకి మర్ధనా చేయాలి. ఈ తాజా వాటర్ మెలోన్ లో కొద్దిగా తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.


ఇది ఆయిల్ చర్మానికి నేచురల్ గా పనిచేస్తుంది. 2. ఓల్డ్ షేడ్స్ నివారించేందుకు : వాటర్ మెలోన్ లో ఉండే లైకోపిన్, విటమిన్ సి మరియు విటమిన్ ఎ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. అంలాగే యాంటీఆక్సిడెంట్స్ కూడా ముడతలను, కళ్ళ క్రింద చారలను తొలగిస్తుంది.   3. శరీరానికి తేమను అందిస్తుంది: వాటర్ మెలోన్ జ్యూసీ ఫ్రూట్ కాబట్టి శరీరాన్ని ఎప్పడూ తేమగా ఉంచుతుంది. మీరు కనక పొడి చర్మంతో బాధపడుతున్నట్లైతే వాటర్ మెలోన్ మీద తేనె చిలకరించి ముఖానికి మాయిశ్చరైజ్ చేసుకోవాలి.


డీహైడ్రేషన్ వల్ల ముఖం డల్ గా మరియు డ్రైగా ఉంచుతుంది. కాట్టి ఈ జ్యూస్ రెడ్ ఫ్రూట్ ను మీ డైలీ డైయట్ లో చేర్చుకోండి. 4. ఆయిల్ చర్మానికి : ఇందులో ఉండే విటమిన్ ఎ చర్మలోపల ఉన్న నూనె మగ్రంధులను తగ్గిస్తుంది. దాంతో ముఖంలో జిడ్డు కూడా తగ్గి ముఖం తాజాగా ఉంటుంది. ఈ సీజన్ లో మీకు అతి సులభంగా, చౌకగా దొరికే ఈ పండును తీసుకొచ్చి తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, బ్యూటీ బెనిఫిట్స్ ను కూడా సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: