సౌందర్య పోషణలో గులాబీల పాత్ర కీలకం. అద్భుతమైన గులాబీకి మానసికంగా కూడా సాంత్వనిచ్చే చక్కని సుగుణాలున్నాయి. దాదాపుగా ప్రతిఇంట్లోనూ కనిపించే గులాబీలు సీజన్ లో విరివిగా ఎక్కడబడితే అక్కడ దొరుకుతాయి. అందుకే అమ్మాయిలు చక్కగా ఇంట్లోనే కూచుని చేసుకోగలిగే కొన్ని సౌందర్యపోషకాలను గురించి చూద్దాం. గులాబీ నూనె ఖరీదు బాగా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ చాలా మేలుచేస్తుంది. ఇక రోజ్ వాటర్ యాస్ట్ర్రింజెంట్ లా పనిచేస్తుంది. అలసిసొలసిన చర్మానికి తాజాదనాన్నిస్తుంది.

Image result for rose water beauty

ఎలర్జీలకు రోజ్ వాటర్ బాగా పనిచేస్తుంది. మొటిమలు, మచ్చలు, ఎండకు కమిలిన చర్మానికి ఈ రోజ్ వాటర్ మంచిమందు. క్రమంగా తప్పకుండా వాడితే చర్మం కోమలంగా అందంగా తయారవుతుంది. బ్యూటీ క్రీమ్ : గుప్పెడు గులాబీరేకులు, అయిదారు చుక్కల నిమ్మరసం, రెండు చెంచాల శనగపిండి, చిటికెడు పసుపు కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీనిని ముఖంపై వేసుకుని ఇరవై నిమిషాలపాటు ఉంచాలి. ఆ తర్వాత పాలతో దీనిని కడిగేయాలి. చివరకు మంచినీటితో ముకం కడుక్కుంటే తాజాగా ఉంటుంది.

Image result for rose water beauty

పదిహేనురోజుల పాటు క్రమంతప్పకుండా ఇలా చేస్తే... గులాబీ సౌందర్యం మీ సొంతం! రోస్ వాటర్ : రెండు పెద్ద బౌల్స్ నిండా గులాబీరేకులు తీసుకుని వాటిని వెడల్పుగా ఉండే మందపాటి గిన్నెలో పోసి అవి మునిగేంత మంచినీటిని పోసి సన్నటి సెగపై ఉడకనివ్వాలి. ఇందులోని నీరు సగానికి సగం అయిన తర్వాత ఆ నీటిని వడకట్టి చల్లార్చాలి. దీనిని ఓ శుభ్రమైన సీసాలో పోసి ఫ్రిజ్ లో భద్రపరుచుకుంటే, మీకు కావలసినప్పుడల్లా వాడుకోవచ్చు. వేసవిలో దీని అవసరం చాలా ఎక్కువ.

Image result for rose water beauty

ఫేస్ మాస్క్ : మంచి చిక్కని పెరుగులో తాజా ఎర్రగులాబీరేకులు, నాణ్యమైన టాల్కం పౌడర్ లను పరిశుభ్రమైన గిన్నెలో కలిపి ఆ తర్వాత వాటిని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ముఖం శుభ్రం చేసుకుని ఈ ప్యాక్ వేసుకోవాలి. పదినిమిషాల తర్వాత చల్లని నీటితో గడిగేయాలి. గులాబీరేకులు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. పెరుగు కమిలిన చర్మానికి కొత్త కాంతినిస్తుంది. అదనంగా చర్మంపై ఎలాంటి జిడ్డు మిగలకుండా టాల్కంపౌడర్ చూస్తుంది.

Related image

ఫేషియల్ టోనర్ : పావు కప్పు రోజ్ వాటర్ కు అయిదారు చుక్కల గ్లిజరిన్, కొద్దిగా తేనె కలపాలి. పొడిచర్మం ఉన్నవారు మరికాస్త గ్లిజరిన్ ను వేసుకుంటే మంచిది. ఈ మిశ్రమాన్ని దూదితో ముఖం అంతా సమంగా పరచుకునేలా రాసుకోవాలి. తర్వాత పదిహేను నిమిషాలకు చల్లని నీటితో కడిగేయాలి. గ్లిజరిన్ తేనెల వల్ల చర్మానికి మృదుత్వం నిగారింపు వ వస్తాయి. కాస్త ఓపిక చేసుకుంటే ఈ గులాబీ సౌందర్య వంటకాలు హాయిగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఎండనపడి ఎక్కడికో వెళ్లనవసరం లేకుండా ఇంటిపట్టునే ఉండి గులాబీ సౌందర్యాన్ని మీరిలా సొంతం చేసుకోవచ్చు.   

మరింత సమాచారం తెలుసుకోండి: