దురద చాలా మందికి ఎదురయ్యే సమస్యే..కానీ కొంతమందిని  అధికంగా వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్యకి ప్రధాన కారణం ఇన్ఫెక్షన్లు. మనం స్నానం చేసే నీరు శుభ్రంగా లేకపోయినా.... తినే ఆహారం, త్రాగే నీరు, ఇలా ఏదో ఒక విషయం దురదకి కారణం అవుతుంది. దుర‌ద నుంచి బ‌య‌ట ప‌డేందుకు చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.

Image result for allergy problems

దురదకి సరైన మందు వేప . వేపనునే ద్వారా దురదని తగ్గించుకోవచ్చు. పసుపుతో కూడా దురదల్ని తగ్గించవచ్చు. ఎందుకనగా పసుపు, వేప రెండిటిలో కూడా యాంటి బయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండిటి మిశ్రమాన్ని ముద్దగా నూరి వంటికి పట్టించి స్నానం చేస్తే చాలు..దురదలు తగ్గుతాయి..ఇలా వారానికి ఒకసారి చేయాలి.

Image result for neem juice

ఉసిరికాయ పొడి, ఆవు నెయ్యితో కలిపి..మూడు పూటలా తీసుకుంటే చాలు దురదలు రావు. అంతేకాదు ఇంకా వేప, పసుపు ముద్దకు సున్నిపిండి కలిపితే ఒంటి మీద మురికి పోతుంది. మృత కణాలు తొలగిపోతాయి. చర్మం శుభ్రం అవుతుంది. కొబ్బరినూనెలో వేపాకు రసం కలిపి బాగా కాచి శరీరానికి రాసుకుంటే దురద తొలగిపోతుంది నిమ్మరసం కలిపిన నీటితో స్నానం చేయడం ద్వారా చర్మ వ్యాధులని పోగొట్టుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: