అందమైన ముఖానికి పెదాలు మరింత అందాన్ని ఇస్తాయి. మీ చిరునవ్వుకి మరింత అందాన్ని అద్దుతాయి పెదాల అందం..ముఖ్యంగా చలికాలలో మనం  ఎక్కువగా ఇబ్బంది పడేది పెదాల పగుళ్ళు.వాపుల వల్లనే అంతేకాదు.పెదాలు ఈ చలికాలంలో ఎక్కువగా పగులుతు... రక్తం కారుతూ ఉంటాయి.అందుకే పెదాల సంరక్షణ చాలా అవసరం. చాలా మంది పెదాలకి కాస్మోటిక్స్ లు ఎక్కువగా వాడుతూ ఉంటారు.రసాయనాలతో కూడిన లిప్టిక్స్ వాడుతూ అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు.


అయితే అలాంటి వారు గ్లిసరిన్ తప్పకుండా ఎంతో మేలు చేస్తుంది. గ్లిసరిన్ వల్ల‌ పెదాలు మృదువుగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. టివీలలో వచ్చే ప్రకటనలలో కంపెనీలు వారు తయారు చేసిన లిప్ బామ్‌లు పొడిగా, అందవికారంగా ఉన్న పెదాలు, అదంగా, ఆకర్షణీయంగా మారుతాయని చూపిస్తుంటారు. కానీ వాస్తవంలోకి మటుకు అవి ఎందుకు పనికిరానివి అని గమనించడం ముఖ్యం. అయితే గ్లిసరిన్ లో మాత్రం పెదాలను గులాబి రంగులో, మృదువుగా మారుస్తుంది. అంతేకాదు పెదాలని ఎప్పుడు పొడిబారనివ్వ‌దు.


ఒక స్పూన్ పాల మీగడ తీసుకుని దానిలో నాలుగు గులాబీ రేకులు వేసి మెత్తగా నూరుకోవాలి. అలా వచ్చిన మిశ్రమాన్ని పెదాల మీద ఉంచాలి..అంతేకాదు ఈ కాలంలో పగిలిన పెదాలకి..పొడిబారిన పెదాలకి..పగిలిన మరియు పొడిగా ఉండే పెదాలకు ఇదొక మంచి ఔషదంగా చెప్పవచ్చు. గ్లిసరిన్ ను శీతాకాలంలో వాడటం వల్ల‌ మంచి ఫలితాలను పొందవచ్చు.  సిగరెట్ తాగటం వంటి దురలవాట్ల అలవాట్ల పెదాలు ముదురు రంగులోకి మారతాయి. ఇలాంటి సమయంలో గ్లిసరిన్ సహాయపడుతుంది.


రోజు రాత్రి పడుకునే ముందు గ్లిసరిన్ అప్లై చేసి పడుకొని, ఉదయాన మీ పెదాలను చూడండి. పెదాలపై ఉండే చర్మం పలుచగా చాలా సున్నితంగా ఉంటుంది కావున ముఖ: చర్మానికి తీసుకునే జాగ్రత్తల కన్నా వీటికి మరింత జాగ్రత్త తీసుకోవాలి. సాధారణంగా వాడె లిప్ బామ్ లు కొన్ని గంటలలోనే వాటి సామర్థ్యాన్ని కోల్పోతాయి. కానీ గ్లిసరిన్ పూర్తి రోజు పెదాలకు తేమను అందిస్తుంది..పొడిగా ఉండే పెదాలు సాధారణంగా దురదలకు మరియు చికాకుకు గురి చేస్తాయి. అందుకే సహజ సిద్ద పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలకి పరిష్కారం ఆలోచించడం మంచిదే.


మరింత సమాచారం తెలుసుకోండి: