యుక్త వయసులో ఉన్న వారికి మొటిమలు తెగ ఇబ్బంది పెడుతూ ఉంటాయి..కొంతమందికి అక్కడక్కడా ఉన్నా మరికొంతమందికి ఇవి మొఖంఅంతా అవరించేస్తాయి. చర్మంపై ఉండే రంధ్రాలు మూసుకుని పోవడం వలన ఈ సమస్య అధికంగా వస్తు ఉంటుంది. అందుకే బయట నుంచీ వచ్చినప్పుడు ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. మొటిమలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాల ఉత్తమం..మొటిమలు వచ్చిన తరువాత వాటిని తగ్గించడానికి సమయం పట్టినా తగ్గించే ప్రయత్నంలో అనేక రకాలైన మందులు..క్రీములు వాడి ఎంతో మంది సైడ్ ఎఫెక్ట్స్ తో చర్మాన్ని పాడుచేసుకున్న వాళ్ళు అనేకం.

 

కానీ సహజసిద్ధమైన పద్దతుల ద్వారా మొటిమలు నివారణ చేసుకోవచ్చు..ఈ న్యాచురల్ పదార్థాల్లో చర్మానికి హాని కలిగించే కెమికల్స్ ఉండవు..అంతేకాదు వీటికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు.చాల సులభంగా సహజ పద్దతిలో మొటిమలు పోవాలంటే అరటిపండు తొక్కతో ఈ సమస్య పరిష్కారం అవుతుంది.చాలా మందికి తెలియని ఒక పూర్వపు పద్దతి ఇది. అరటి పండు తొక్క లోపల ఉండే గుజ్జు ద్వారా మొటిమల నివారణ చేపట్టవచ్చు..అంతేకాదు..ఈ పద్దతుల్లో..అరటి తొక్కతో పాటు కొన్ని రకాల పదార్ధాలు కలిపి కూడా మొటిమల నివారణ చేపట్టవచ్చు. 

 

ముందుగా అరటి తొక్క లోపలి భాగాన్ని చర్మానికి రుద్దుతూ ఉండాలి ఆ గుజ్జు కరిగి మొటిమలకి చేరుకునేలా..ఈ సమయంలో అరటి తొక్క డార్క్ గా అవుతుంది..దాని పడేసి మరొక తొక్కతో రుద్దాలి.. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే అరటి తోక్కలోపల భాగంలో ఉండే గుజ్జులో యాంటీఆక్సిడెంట్స్,విటమిన్స్ మొటిమల నిరోధిస్తాయి.

 

అలాగే అరటి తొక్కని మెత్తగా చేసుకుని..దానిలో కొంచం తేనే కలిపి..ఆ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని పేస్ ప్యాక్ లా ఉంచాలి 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా మొటిమలు నివారణ కూడా జరుగుతుంది.  అరటిపండు తొక్కతో ముందుగా ముఖాన్ని మర్దనా చేసి..రెండు నిమిషాల తరువాత దానిమీద కలబంద గుజ్జు వేసి మర్దనా చేయాలి 15నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో  శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా సరే మొటిమల నివారణ సులభంగా చేయవచ్చు..పైగా ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు.


మరింత సమాచారం తెలుసుకోండి: