మీరు చాలా మందిని గమనించే ఉంటారు..అతి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడి పోవడం మొదలవుతుంది.మరి కొంతమందికి యుక్తవయస్సు వచ్చినప్పుడు జుట్టు తెల్లబాడటం మొదలవుతుంది..అసలు సాధారణంగా జుట్టు తెల్లబడే వయస్సు పూర్వం 55 మొదలవుతుంది అని తెలుస్తోంది. జుట్టు తెల్లబడటానికి అనేక కారణాలు ఉన్నాయి..వారిలో ముఖ్యమైనది విటమిన్స్ లోపం..దాని తరువాత ఆహారపు అలవాట్లు..ఇలా అనేకకారణాలు ఉన్నాయి

 

ఆరోగ్యకరమైన ఆహరం తింటే మీకు ఎటువంటి సమస్యా ఉండదు.. మీరు వాడే మోటార్ బైక్ లో ఇంజన్ ఆయిల్ పోయకపోయినా కొన్ని రోజులు తిరుగుతుంది కానీ కొన్ని రోజుల్లోనే ఇంజన్ పాడయ్యి పోతుంది.. ఇదే విధముగా శరీరానికి కావలసిన విటమిన్స్ ఇవ్వకపోతే అది మనకి ఏ విధంగా కూడా సాయం చేయలేదు.. విటమిన్ మరియు మినరల్ వంటి పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు తినటం వలన మీరు యవ్వనంగా కనపడటమే కాదు యవ్వనంలో జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.

 

జుట్టు తెల్లబడకుండా..ఊడిపోకుండా కావలసినవి అత్యంత విలువైన విటమిన్స్ “బి” ఇవి మనకి సరైనా స్థాయిలో లేకపోతే ఇటువంటి సమస్యలే ఎదురవుతాయి విటమిన్స్ “బి” “బి6” “బి 12 “ బి 2”ఇవే మీ జుట్టు పోషణకి ముఖ్యంగా ఉపయోగపడేవి.. ఇవి ఎక్కువగా తాజా పండ్లు..ఆకు కూరలు..పచ్చి కూరగాయల్లో దొరుకుతుంది..యువకులలో జుట్టు తెల్లగామారటానికి గల కారణం- అనీమియా మరియు ఐరన్ లోపం వలన అని చెప్పవచ్చు. ఈ రకమైన జుట్టు తెల్లబడటాన్ని నివారించుటకు పాలకూర..సోయా పాలని తాగవచ్చు..ఇవిశరీరానికి కావలసిన ఐరన్ ను అందిస్తాయి.అంతేకాదు నువ్వుల గింజలు బెల్లం కలుపుకుని తిన్నా కూడా జుట్టుకి ఎంతో పోషణ కలిగిస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: