ముఖం అందంగా కనిపించడానికి మనం ఎన్నోరకాల పేస్ ప్యాక్స్ వాడుతూ ఉంటాం..చాలా మంది బ్యూటీ పార్లర్స్ కి వెళ్తూ ఉంటారు..అనేకరకాల రసాయనాలతో ఉపయోగించిన పేస్ ప్యాక్స్ మన ముఖానికి పూస్తారు. ఎటువంటి జాగ్రత్తలు శరీర తత్వం తెలుసుకోకుండా అలాంటి వాళ్ళు చేసి ఇటువంటి పనులవల్ల ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉన్న చర్మాన్ని కూడా పాడుచేసుకోవడం అవుతున్నది.ఇది చాల మందిలో జరిగింది కూడా ఇంట్లోనే సహజ సిద్దంగా చేసుకునే ఈ ప్యాక్స్ వలన మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వీటిలో ఎటువంటి రసయానాలు కలవవు.

 cucumber face pack కోసం చిత్ర ఫలితం

కీరదోసకాయ ఒకటి. కీరదోసకాయలో చర్మానికి అవసరమయ్యే వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ సి కూడా ఉంటుంది. కీరతో స్కిన్ కేర్ చేసుకోవడం ఎంతో మంచిది చర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది..మంచి గ్లో వస్తుంది. చర్మం పూర్తిగా శుభ్రపడి, స్కిన్ క్లియర్ గా మారుతుంది. ఎలాంటి మేకప్ లేకుండానే చర్మం అందంగా కనబడుతుంది. కీరదోసతో ఎలా పేస్ ప్యాక్ చేయచ్చో ఇప్పుడు చూద్దాం.

 

ముందుగా కీరదోస నుంచీ రసం తీయాలి..ఆ రసాన్ని 3 స్పూన్స్ తీసుకుని ఒక గిన్నెలో వేయాలి..దానిలో ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి.ఇప్పుడు ఈ రెండిటిని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని అవసరమైనప్పుడు చర్మానికి పట్టించాలి..ఇలా రోజులో ఎప్పుడైనా చేయవచ్చు..ఇలా చేసినప్పుడు 10 నిమిషాలు ఉంచుకుని,తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయండి చాలు మీ స్కిన్ చాల ఫ్రెష్ గా కాంతివంతంగా కనిపిస్తుంది.

 cucumber కోసం చిత్ర ఫలితం

అంతేకాదు గ్రీన్-టీ  -కీరదోస తో కూడా పేస్ ప్యాక్ చేసుకోవచ్చు 1 స్పూన్ గ్రీన్ టీ లో , 3 స్పూన్ల కీరదోస రసాన్ని కలపాలి.ఈ మిశ్రమాన్ని మీరు ఒక బాటిల్లో భద్రపరుచుకోవచ్చు..ఆ రసాన్ని ఎప్పటికప్పుడు మీరు ముఖానికి పట్టించి పది నిమిషాలు అగినతరువాట కడిగితే చర్మం ఎంతో టైట్ గా..కోమలంగా తయారవుతుంది. ఇటువంటి సహజసిద్ధమైన పద్దతులు పాటిస్తే మీ చర్మాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండవచ్చు.

 

 



మరింత సమాచారం తెలుసుకోండి: