గుమ్మడి కాయ ఎంతో ఆరోగ్యవంతమైన ఫలం..దీనిని ఎక్కువగా శీతాకాలంలో తింటూ ఉంటారు.ఈ గుమ్మడి పండుని పూర్వం నుంచీ మనవాళ్ళు ఉపయోగిస్తున్నారు..ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. గుమ్మడికాయలో విటమిన్లు..చర్మాన్ని పునరుద్దరించే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి..ఈ గుమ్మడి పండులో ఉన్న ప్రత్యేకత ఏమిటింటే. చర్మాన్ని సహజంగా ఉంచి వయసు మీదపడుతున్నా సరే యవ్వనంలా కనిపించేలా చేస్తుంది. 

Image result for pumpkin skin mask
 ప్రకాశవంతమైన మేలిమి చర్మాన్ని పొందటానికి.. ఎలా ఉపయోగపడుతుంది అంటే..చర్మం మీద మూసుకుపోయిన రంద్రాలని..తెరుచుకునేలా చేయడంలో ఇది ప్రధానపాత్ర పోషిస్తుంది.. అయితే గుమ్మడి కాయలో రెండు రకాలు ఉన్నాయి..ఒకటి తీపి గుమ్మడి రెండు బూడిద గుమ్మడి. తీపి గుమ్మడి కాయని ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం..


ఒక గుమ్మడి కాయ ముక్కని తీసుకుని దానిలో ఒక ముక్క ని పేస్టులా చేయాలి..దానిలో “E” విటమిన్ సంభందిచిన నునేను కలపాలి  - ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసి పావుగంట అలా ఉంచాలి..చల్లని గాలి తగులుతూ ఆ మిశ్రమం అట్టలా కట్టేవరకు ఉంచి ..తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. అప్పుడు మీ చర్మం చాల మృదువుగా..ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది.

 Related image

అలాగే ఒక చెంచా గుమ్మడి పేస్టు తీసుకుని దానిలో మరొక చెంచా రోజ్ వాటర్ కలిపి..దానిలో ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడి కలపాలి..ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి సుమారు 20 నిమిషాలు ఉంచి వదిలియాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి..ఇలా చేయడం వలన కూడా మీ చర్మం నిగారిస్తూ..మిడి వయస్సుల ముఖం కూడా యవ్వనస్తులుగా కనిపిస్తుంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: