చింతపండు ఈ పేరు తలవగానే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి.ఎంతో పుల్లగా ఉంటాయి...అయితే చింతపండు ఎంతపుల్లగా ఉన్నా సరే చర్మానికి మాత్రం ఎంతో మేలు చేస్తుంది. చింతపండు గుజ్జుని నేరుగా చర్మంపై ఉపయోగించకూడదు..అందులో కొన్ని చర్మ సంరక్షణ పదార్దాలు కలిపి ఆ గుజ్జుని చర్మానికి పట్టించాలి. అయితే ఈ చింతపండు ప్యాక్ వాళ్ళ చర్మానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి.

 tamarind face mask కోసం చిత్ర ఫలితం

చింతపండు పేస్ ప్యాక్ చేసే విధానం..ఎలా ఈ ప్యాక్ ని ఉపయోగించాలో తెలుసుకుందాం..ముందుగా కొన్ని వేడి నీళ్ళు తీసుకుని దానిలో కొంత చింతపండుని వేసి15 నిమిషాల పాటు నానబెట్టాలి.ఆ తరువాత నానిన చింతపండు నుంచీ గుజ్జుని తీసేయాలి.చింతపండు గుజ్జులో చిటికెడు పసుపు పొడి కలపాలి..ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు చర్మానికి పట్టించాలి...సుమారు ఒక గంట సమయం వరకూ అలానే ఉంచుకుని ఆతరువాతా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

 

చింతపండు పేస్ ప్యాక్ లో మరొక పద్దతి కూడా ఉంది..చింతపండు..పెరుగు మరియు కల్లు ఉప్పు తో పేస్ ప్యాక్ ఎలా

చేయాలో చూద్దాం ముందుగా వేడి నీటిలో చింతపండును 15 నిమిషాల పాటు నానబెట్టాలి  ఆ తరువాత నానిన చింతపండు నుంచి గుజ్జును ఒక టేబుల్ స్పూన్ తీసుకుని ఆ గుజ్జుకు అరస్పూన్ పెరుగు కలపాలి..ఈ మిశ్రమానికి చిటికెడు కల్లు ఉప్పు కలిపి ముఖం మీద ఎక్కడైనా చర్మం రంధ్రం గా ఉన్న ప్రాంతాలలో రాసి మసాజ్ చేసుకోవాలి.

 

 tamarind face mask కోసం చిత్ర ఫలితం

ఇలా సుమారు 10 నిమిషాల పాటు చేయాలి..ఒకే వేళ పెరుగు అంటే అలర్జీ ఉన్న వాళ్ళు పచ్చి పాలను ఉపయోగించవచ్చు. ఇలా చేసిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగితే చర్మం నిగారింపుగా కనపడుతుంది..అంతేకాదు కొన్ని రోజులకి రంధ్రాలు  మూసుకుపోతాయి.

 

 


 


మరింత సమాచారం తెలుసుకోండి: