చలి కాలం వచ్చిందంటే చాలు ఎక్కడ లేని అనారోగ్య సమస్యలు అన్ని వచ్చి చేరుతూ ఉంటాయి..వర్షాకాలం తరువాత ఎక్కువగా వ్యాధులు ప్రభాలే కాలం చలికాలం అని అంటున్నారు వైద్యులు..చలికాలంలో ఎక్కువగా చర్మ సంభందిత వ్యాధులు వస్తూ ఉంటాయి...చలికాలం వెళ్ళేంత వరకూ కూడా చర్మ సంరక్షణపై ఎక్కువగా శ్రద్ద చూపించాలి..లేనంటే అనేకరకాల సమస్యలు చర్మంపై చేరి చర్మాన్ని నాశనం చేస్తాయి.

 Image result for cucumber face mask for glowing skin

శరీరంపై తేమ తగ్గిపోవటంతో చర్మం పొడిగా..దురదగా..పొరలు పొరలుగా ఊడిపోతూ..నిగారింపు లేకుండా నిర్జీవంగా ఉంటుంది..ఈ ప్రభావం ఎక్కువగా పెద్దవారిలో..పిల్లల్లో కనపడుతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్ది చర్మాన్ని కాపాడే ద్రవాలని మనం కోల్పోతూ ఉంటాం..ఎప్పుడైతే పొడి చర్మం మన శరీరాన్ని ఆవరిస్తుందో అప్పుడు తరచుగా చలికాలపు  దద్దుర్లు ( ర్యాషెస్) మనల్ని భాదిస్తూ ఉంటాయి. ఎంత ఆరోగ్యవంతమైన చర్మం ఉన్న వారైనా సరే చలి కాలంలో ఎదో ఒక సమయంలో వీటి వారిన పడక తప్పదు. అయితే ఈ దద్దుర్లు లేదా ర్యాషేస్ రాకుండా లేదా వచ్చినా సరే ఎటువంటి జగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పద్దతులు పాటించాలి అనేది తెలుసుకుంటే చాలు.ఎప్పడు మీ చర్మం తేమగా ఉండటానికి ఇలా చేస్తే చాలు..


దోసకాయలో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి..అయితే వీటిలో రెండు రకాల దోసకాయలు ఉన్నాయి ఒకటి మనం ఎక్కువగా వంటలకి ఉపుయోగించేది మరొకటి..కీర దోస చర్మ సౌందర్యానికి..ఆహరంలోకి ఉపయోగిస్తారు..కీర దోసలో తేమ గుణాలు చాల అధికం. చర్మాన్ని చల్లబరిచి మంటని వాపుని తగ్గించే గుణం దీనికి ఉంది..

Image result for winter skin glow tips

ముందుగా దోసకాయ పైన తోలుని తొలగించి ముక్కలు ముక్కలుగా చేసి  ముక్కలు చేసి పేస్టులా చేయండి. వచ్చిన ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 ననిమిషాలు అలానే ఉంచండి..తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి చాలు.



అలాగే బొప్పాయి కూడా మనకి ఎప్పుడు అందుబాటులో ఉండే ఫలమే..బొప్పాయిలో ఉండే మరొక గుణం ఏమిటి అంటే చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది..చర్మాన్ని నిగారిపు చేకూర్చుతు..ఎరుపు రంగులోకి మార్చుతుంది.బొప్పాయిని కూడా దోసలాగా ముక్కలుగా చేసి గుజ్జుగా చేసిన తరువాత అవకాడో కలపండి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించండి..అలా సుమారు 15 నిమిషాలు ఉంచిన తరువాత నీటితో కడిగేయండి ..ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు మీ చర్మం నునుపుగా ,లేలేతగా కనిపిస్తుంది.

 Image result for papaya face mask

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: