బ్లాక్ హెడ్స్..అంటే  చాలా మంది యువతీ యువకులకి ముక్కు మీద నల్లటి మచ్చలు వస్తుంటాయి..ఇవి ఎక్కువగా యుకతవయసులో ఉన్నవారికి మాత్రమే వస్తాయి..ఈ బ్లాక్ హెడ్స్ వచ్చినప్పుడు ముఖం చాలా అంద విహీనంగా తయారవుతుంది..అంతేకాదు చర్మం ఎర్రగా కందిపోతుంది కూడా..కాలేజీలకి వెళ్ళాలి అన్నాసరే వెళ్ళలేని పరిస్థితి..చాలా మంది ఎంతో అందంగా ఉంటారు..వారు బయటకి వెళ్ళాలి అంటే ఈ బ్లాక్ హెడ్స్ చిరాకుని కలిగిస్తాయి. అసలు ఈ బ్లాక్ హెడ్స్ ఎందుకు వస్తాయి..కారణం ఏమిటి అనే విషయం పరిశీలిస్తే.

 Related image

మానవ శరీరంలో ఉండే సెబాషియస్ గ్రంథి సీబం అనే తైలాన్ని ఎక్కువగా స్రవించడం వల్ల..ఇది మృత కణాలతో కలిసి చర్మ రంధ్రాలను పూడ్చేయడంతో బ్లాక్ హెడ్స్ సమస్య ఉత్పన్నమవుతుంది.అయితే ఇది పెద్ద సమస్య ఏమి కాదు కొన్ని కొన్ని టిప్స్ ని ఉపయోగించి వీటిని తొలగించు కోవచ్చు.

 

బియ్యం పిండిని ఉపయోగించి  బ్లాక్ హెడ్స్ పోవడానికి స్క్రబ్‌లా వాడుకోవచ్చు. బియ్యం పిండిని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట బాగా రుద్దుకోవాలి. కొద్దిసేపు తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఒక కప్పుడు వోట్స్ తీసుకుని వాటిలో కొంచం రోజ్ వాటర్ కలుపుకోవాలి..ఆ మిశ్రమాన్ని తీసుకుని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రుద్దుకుని వేళ్ళతో మర్దనా చేసుకోవాలి తరువాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

 Image result for blackheads home remedies

బేకింగ్ సోడాతో కూడా  బ్లాక్ హెడ్స్ కి బై బై చెప్పేయచ్చు..ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని కొద్దిగా నీటిలో పేస్టులా కలుపుకోవాలి. ముఖాన్ని వెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకొని తర్వాత.. బ్లాక్ హెడ్స్ ఉన్న చోట బేకింగ్ సోడా పేస్టును రాసుకోవాలి. కాసేపు ఆగాక రెండు నిమిషాలపాటు వేళ్ళతో మర్దనా చేసుకోవాలి ఇలా చేస్తే ముఖంమీద ఉండే మృత చర్మం, మురికి తొలగిపోతాయి.వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చాలు ఇక ఈ సమస్య మీ దరి చేరదు.

 

తాజా నిమ్మ కాయనుంచీ నిమ్మ రసం తీసి..అందులో కాట‌న్ బాల్స్‌ను ముంచి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాయాలి. కాసేపు సేపు ఆగాక గోరు వెచ్చ‌ని నీటితో ముఖం క‌డిగేయాలి.ఇలా చేయడం వాళ్ళ కూడా బ్లాక్ హెడ్స్ కి చెక్ పెట్టచ్చు..

Image result for blackheads boys

మరింత సమాచారం తెలుసుకోండి: