చాలా మంది పొట్టిగా ఉన్నాం అని చాలా భాద పడిపోతుంటారు..ప్రక్రుతి ధర్మం ప్రకారం మనం పుట్టం కానీ దానిలో సిగ్గు పడవలసిన అవసరం లేదు..అయితే పొట్టిగా ఉన్నాము అని భాదపడే వాళ్ళు కొన్ని కొన్ని చిట్కాలు పాటించడం వల్ల పొడుగ్గా కనిపించవచ్చు..ఇలా చేయడం వల్ల కేవలం మనం అందంగా కనపడటం మాత్రమే కాదు శారీరకంగా ఉండే సమస్యలని బయటకి కనపడకుండా చేసుకోవచ్చు.

 పొట్టిగా ఉన్నా పొడుగ్గా కనబడతారు! కోసం చిత్ర ఫలితం

చాలా మంది ఎత్తు ఎక్కువగా లేము అని మానసికంగా కుంగిపోతు ఉంటారు. ఈ విషయంలో వాళ్ళు కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు..వారు పడే ఆత్మన్యూనతా భావం నుంచీ బయటపడచ్చు..ఎత్తు,పొట్టి అనేది జన్యుపరంగా సంక్రమిస్తుంది తప్ప మనం చేసేది ఏమి ఉండదు అనేది  ఇందులో మనం చేసేది ఏమి ఉండదు. కుటుంబ వారసత్వం ఆధారంగా పొడుగు, పొట్టి అనేది ఉంటుంది. అయితే చిన్న చిట్కాలతో పొడుగ్గా కనిపించడం కష్టం కాదు. నిటారుగా నిలబడటం..కూర్చోవడం వల్ల పొడుగ్గా కనిపించవచ్చు. నడిచేటప్పుడు వంగడం వల్ల ఇంకా పొట్టిగా కనపడతారు.

how to look taller men కోసం చిత్ర ఫలితం
ఎత్తు తక్కువ ఉన్న వాళ్ళు..కొన్ని రకాల దుస్తుల్ని ధరించడం వాళ్ళ పొడుగ్గా కనపడేలా చేస్తాయి.ముఖ్యంగా చెక్స్ డిజైన్ ఉన్న దుస్తులు ఉన్నదానికంటే పొట్టిగా కనపడేలా చేస్తాయి. ఏక రంగు..నిలువు చారలు ఉండే దుస్తులు వేసుకుంటే పొట్టిగా ఉన్నామనే ఫీలింగ్ నుంచి ఉపశమనం కలుగుతుంది.అంటే ఎత్తు తక్కువ ఉన్న వాళ్ళు డిజైన్లు నిలువుగా ఉన్నవే వేసుకోవడం మంచిది..అడ్డంగా ఉన్నవి వేసుకుంటే మారిత పొట్టిగా కనిపిస్తారు.

 

పొట్టిగా ఉన్నవారు పాటించవలసిన మరొక చిట్కా ఏమిటి అంటే..శరీరానికి పట్టినట్టుగా ఉండే దుస్తుల్ని ధరించడం చాలా మంచిది..లూజుగా ఉండే బట్టల్ని వేసుకుంటే ఉన్న ఎత్తుకంటే కూడా మరింత తక్కువ ఎత్తు కనిపిస్తారు.అదే బిగుతుగా ఉండే దుస్తుల వల్ల మరింత పొడుగ్గా ఉన్నామనే భావన కలుగుతుంది. జీన్స్ లేదా ఇతర ఆధునిక దుస్తులు ధరించినప్పుడు పెన్సిల్ కట్ లాంటివి ధరించాలి ఎందుకంటే  పాదం దగ్గర ఫ్యాంటు లూజుగా ఉంటే పొట్టిగానే కనపడే అవకాశం ఉంది.

how to look taller men కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: