పట్టణాలలో చాలా మంది స్త్రీలు చర్మ సౌందర్యం కోసం బ్యూటీ పార్లర్స్ కి వెళ్తూ ఉంటారు..అక్కడ వారు ఉపయోగించే రసాయనిక పేస్ ప్యాక్స్ వలన చర్మం సౌందర్యంగా అవ్వడం మాట పక్కన పెడితే ఉన్న చర్మం కాస్తా ఎలర్జీలు..స్కిన్ ఇన్ఫెక్షన్ లతో నాశనం అవుతుంది..అయితే ఈ బ్యూటీ పార్లర్స్ లో చాలా మంది ఇప్పుడు రూటు మార్చి..మేము పేస్ ప్యాక్స్ సహజసిద్ధమైన పదార్ధాలు ఉపయోగించి చేస్తున్నాం అంటూ డబ్బులు మామూలుగా కంటే ఎక్కువగా దండుకుంటున్నారు..అదే పేస్ ప్యాక్ మీరు ఇళ్ళలో ఉండి ఇంట్లో వారి సహాయంతో చేసుకోవచ్చు..ఎలా అంటే

 Image result for gram flour skin beauty

ఈ పేస్ ప్యాక్ కోసం మనం ప్రత్యేకంగా కొనవలసిన అవసరం లేదు వంటింట్లో దొరికే సరుకులతో..పదార్ధాలతో ఈ పేస్ ప్యాక్ చేసుకోవచ్చు..తరతరాలుగా మన పూర్వీకులు వాడే పద్ధతినే ఇప్పుడు మనం చూడబోతున్నాం..ఈ పేస్ ప్యాక్ వలన చర్మానికి హాని చేసే మృత కణాలు చాలా సులువుగా పోతాయి.అంతేకాదు అనేకమైన చర్మ సమస్యల నుంచీ చర్మాన్ని రక్షిస్తుంది కూడా.శనగపిండి చర్మం మీద నలుపు,మృతకణాలను తొలగించటంలో బాగా సహాయపడుతుంది.

 

చర్మాన్ని కాంతివంతంగా..మృదువుగా చేయడంలో శనగపిండి ఎంతో ఉపయోగ పడుతుంది..బయటకు వెళ్ళినప్పుడు చర్మంపై కాలుష్యం, దుమ్ము వంటి కారణాలతో చర్మం నిర్జీవంగా మారుతుంది. అలాంటి సమయంలో శనగపిండితో కేవలం పది నిమిషాల్లోనే ముఖాన్ని కాంతివంతంగా మార్చవచ్చు. ఈ చిట్కాను మగవారైనా,ఆడవారైనా సరే ఉపయోగించవచ్చు..

 Image result for gram flour skin beauty

ఇందుకోసం శనగపిండి..గోధుమపిండి..పసుపు..పెరుగు తీసుకోవాలి ఇవన్నీ మనకి ఇంట్లో దొరికీ పదార్దాలే.ఇవి మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ నాలుగు పదార్ధాలు చర్మాన్ని ఎంతో మృదువుగా కాంతివంతంగా చేస్తాయి..అంతేకాదు చర్మంపై ఉండే బ్యాక్టీరిగా..మొటిమలు,నల్లని మచ్చల సమస్యలను నివారిస్తుంది. పేస్ ప్యాక్ తయారు చేసే విధానం తెలుసుకుందాం.

 

ఒక బౌల్ లో శనగపిండి వేసి దానిలో ఒక అర స్పూన్ గోధుమపిండి..చిటికెడు పసుపు..పెరుగు వేసి పేస్ట్ గా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి కొంచెం సేపు చేతి వేళ్ళతో 30 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంలో మలినాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

Image result for gram flour skin beauty

మరింత సమాచారం తెలుసుకోండి: