కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడి కంటి అందాన్ని మసక బారుస్తాయి. అవి తగ్గడానికి ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ లో ముంచిన దూదితో కంటి చుట్టూ రెండు, మూడు సార్లు తుడవాలి. తర్వాత ఆలివ్ ఆయిల్ను కొద్దిగా వేలికి తీసుకుని కంటిచుట్టూ రాయి. ముప్పయి రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది. కీరకాయను చక్రాల్లా కోసం ఆ ముక్కలతో వలయాల వద్ద రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. గోరువెచ్చని ఆముదాన్ని వేలికి రాసుకుని కంటి చుట్టూ రాస్తే నలుపు తగ్గుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: