గృహమే కదా స్వర్గసీమ అంటారు. ప్రపంచంలోని అందాలన్నీ తమ ఇంటిలోనే పోగుపోసుకుని ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఇటీవల కాలంలో ఇళ్ళలో అక్వేరియం పెట్టుకోవడం చాలా ఫ్యాషన్ గా మారింది. నిన్న మొన్నటి వరకూ సాదాసీదాగా ఉన్న అక్వేరియంల రూపురేఖల ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. డిజైనర్ అక్వేరియంలే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్.  ఇంటికి కొత్త అందాలు దిద్దడానికి ఎంత ఖర్చయినా లెక్క చేయడం లేదు. అందుకే లక్షల విలువ చేసే అక్వేరియంలు మన ఇంటి ముందు ఉంటున్నాయి. అక్వేరియం ఉంచే గదిని, వారి అభిరుచికి తగినట్టు అక్వేరియం మోడల్స్ లభిస్తున్నాయి. మేఘాల్లా తేలియాడేవి, ఫొటో ఫ్రేమ్ అక్వేరియం, ఫర్నిచర్ మోడల్స్ లో కూడా అక్వేరియాలు లభిస్తున్నాయి. మనకు నచ్చిన మోడల్లో రంగురంగుల చేపలు ఇంటిలో తిరుగుతుంటే ఎంతో అందంగా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: