మహిళల జీవితంలో భాగంగా మారింది మేకప్. బైటకు వెళుతుంటే మేకప్ చేసుకోవడం తప్పనిసరి అయింది. అయితే, మేకప్ సరిగా వచ్చిందో, లేదో చెప్పేది మాత్రం లిప్ స్టికే. పెదాలకు వేసుకునే లిప్ స్టిక్ షేడ్ ను బట్టి మేకప్ ఎలాఉందో చెప్పవచ్చు. స్కిన్ టోన్ కు తగ్గట్టు ఏ షేడ్ వేసుకుంటే, బాగుంటది అనే సందేహాలు ఎదురవుతాయి. అందుకే, లిప్ స్టిక్ కొనేటపడు చిన్న ట్రిక్స్ పాటించండి.   లిప్ స్టిక్ కొనేటపుడు అరచేయి వెనక భాగంలో లిప్ స్టిక్ షేడ్ ని కొద్దిగా రాయాలి. రంగు మరింతగా తెలుసుకోడానికి వేలితో రబ్ చేసి, దాన్ని పెదాలకు రాసుకుని చెక్ చేసుకోవాలి. సూర్యకాంతిలోనే లిప్ షేడ్ బాగా తెలుస్తుంది. తెల్లగా, ఫెయిర్ గా ఉన్నవారు లైటర్ షేడ్ లిప్ స్టిక్ లు సెలక్ట్ చేసుకోవాలి. చర్మం ఫెయిర్ గా ఉండి, జుట్టు నల్లగా ఉన్నవారికి డీప్ పింక్, క్యారమెల్ కాంబినేషన్స్ బావుంటాయి. సాధారణ రంగు చర్మం, జుట్టు వారికి ఏ షేడ్ అయినా బావుంటుంది. చామన ఛాయ కలవారికి వైన్ కలర్ సూటవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: