ప్రతి అమ్మాయి తన టీనేజ్ లో వీలైనంత వరకూ అందంగా ఆకర్షణీయంగా కనబడాలనే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ప్రకృతి సహజంగా ఎదురయ్యే ఇబ్బందులను కూడా తెలుసుకుని, అధికమించడం కూడా తెలుసుకుంటే అమ్మాయిలు నిజంగా విజయం సాదిస్తారు.  రక్తహీనత : ఈ కాలంలో అమ్మాయిలకు ఎక్కువగా కనిపిస్తున్న సమస్య ఇది రక్తహీనత, బలహీనత తెల్లగా పాలిపోయినట్టవడం జరుగుతుంది. ఇందుకు డైటింగ్ అనేది ఈ కాలం అమ్మాయిలకు క్రేజ్ గా మారమే ప్రధాన కారణం. ఎదిగూ వయసులో తగిన పోషక పధార్థాలు తీసుకోవడం వలన రక్తంలో హిమోగ్లిబిన్ శాతం తగ్గిపోతుంది. ఆక్సిజన్ తగినంతగా సరఫరా కాకపోవడం వలన నీరసపడితోతుంటారు. అందువలన తగిన ఆహారాన్ని శుభ్రంగా తీసుకుంటే... ఈ రక్తహీనత సమస్య నుండి అమ్మాయిలు బయటపడతారు. ఈ విషయాన్ని శ్రద్దగా పాటించాలి.


ముఖం మీద మచ్చలు : చర్మ సౌందర్యం బాగుండాలని ప్రతి టీనేజ్ అమ్మాయి కోరుకుంటుంది. కానీ కొందరిలో చర్మం మీద మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలకు ప్రత్యకమైన రంగులేకపోయినా చర్మం రంగు కన్నా బిన్నంగా వుండి స్పష్టంగా కనబడతాయి. అమ్మాయిల శరీరంలో ఈ మచ్చలు ఎక్కడున్నా... ముఖం మీద ఏర్పడిన మచ్చలు స్పష్టంగా ఇతరులకు కనబడుతుంటాయి. ఈ మచ్చలు ఏర్పడటానికి సూర్యరశ్మి కారణం. ఎక్కువగా ఎండలో తిరగడం వలన ఈ మచ్చలు ఏర్పడుతుంటాయి. నిమ్మ, పసుపు కలిగిన క్రీములు వాడడం వలన మచ్చలను నివారించవ్చును. లేదా చర్మ వైద్యునికి చూపించుకుని చికిత్స పొందాలి.


రోమాలు : అమ్మాయిల కామపీఠం, భాహుమూలల్లోనూ రోమాలు ఎదుగుదల వుంటుందిజ ఇతర భాగాల్లో రోమాలు కొందరు అమ్మాయిల్లో సమస్య అవుతాయి. మూతి మీద, కాళ్ళ మీద, చేతుల మీద రోమాలున్న అమ్మాయిలను తోటి అమ్మాయిలే వేళాకోళం చేస్తుంటారు. పసుపు వాడటం వలన అమ్మాయిల శరీరం మీద రోమాలు రాలిపోతాయి. వారానికి రెండు సార్లయినా నలుగు పెట్టుకుని స్నానం చేయడం వలన కూడా ఈ సమస్య పరిష్కారమవుతుంది. ఇవాళ బ్యూటీ పార్లర్ వచ్చాయి. కాబట్టి నెలకు ఒకసారి వాక్సింగ్, త్రెడ్డింగ్ బ్లీచీంగ్, ఫ్లకింగ్ వంటివి ఏదో ఒకిటి చేయించుకుంటే రోమాల సమస్య తీరుతుంది.


చుండ్రు : ఆడడ పిల్లల్లోని చుండ్రు ఒక సమస్య కొంత మంది తలలోంచి చుండ్రు ఎండుపొట్టులా... రాలుతుంటుందిజ మరికొంత మందిలో జిగటగా వుండి, తల వాసన కొడుతుంది. మాడు పై పొరలో మరణించిన కణాలు మాడు ప్రాంతం గుండా వెలుపలికి పంపబడుతున్న వ్యర్థ పధార్థలే ఈ చుండ్రు. ఇది కొందరిలో వంశపారంపర్యంగానూ, కొంతమందికి ఇతరుల నుండి అంటురోగంలా వచ్చే అవకాశం వుంది.  మానసిక ఒత్తిగి, మాడు మీద గాయాలు, పొషక పధార్థాల లోపం, హార్మోన్లు ఉత్పత్తులో లోపం రకరకాల షాంపులు వాడకం వలన కూడా చుండ్రు వస్తుంది. మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ...ఎక్కువగా నీరు త్రాగడం చుండరను నివారించే సహజ మార్గం.దీని వలన ముఖ్యంగా చుండ్రు భాగా అరికడుతుంది.  వారానికి రెండు సార్లన్నా తలస్నానం చేస్తూ మాడును శుభ్రంగా వుంచుకోవాలి. కొవ్వును పెంచే మాంస పధార్థాలను, వేపుడు కూరలను ఎక్కువ తినకూడదు. దీని వలన చుండ్రు సులువుగా నివారణ అవుతుంది.


వక్షోజాలు : టీనేజ్ వయసులోకి అడుగుబెట్టిన అమ్మాయిల్లో వచ్చే శారీరక మార్పుల్లో వక్షోజాల ఎదుగదల ఒకటి... వక్షోజాలు సరైన పరిమాణంలో అందంగా వుండాలని అమ్మాయిలందరూ కోరుకుంటారు. వయసుకు తగ్గట్టు ఆ వక్షోజాలు ఎదుగుదల లేకపోవడానికి అనేక కారణాలున్నాయి. చిన్నతనంలో తల్లిపాలు సరిగా అందకపోవడం, రక్తహీనత, హార్మన్ ల ఉత్పత్తి తగిన తీరులో లేకపోవడం, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య కలుగుతుంది. ఎదను అందంగా తీర్చి దిద్దుకోవడం టీనేజ్ లోనే సాధ్యమవుతుంది. మంచి ఆహారపు అలవాట్లు, ప్రతిరోజూ తగిన వ్యాయామాల వలన వక్షోజాల సౌందర్యాన్ని వృద్ది చేసుకోవచ్చు. నిద్రపోయేటపుడు బోర్లాపడుకోవడం మానేయాలి. వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయనుకున్నవారు. తాత్కాలిక పరిష్కారంగా పాపడ్ బ్రాలు వాడడం వలన ఆకర్షణీయంగా కనబడుతారు. టీనేజర్స్ అమ్మాయిలు ఏ విషయంలోనూ నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. దేన్నయినా సాధించగలమనే ఆత్మ విశ్వాసం కలిగి పెద్దల సలహాలు పొందాలి. దేన్నయినా సాధించగలిగే వయస్సు టీనేజుదే.!  

మరింత సమాచారం తెలుసుకోండి: