నవ్వు ఒక వరం. హాయిగా నవ్వేవారికి ఎలాంటి రుగ్మతలు రావు అని ఒక నమ్మకం. కానీ కొందరు వివిధ కారణాలతో హాయిగా నవ్వలేకపోతారు. ఇలా పదిమందితో నవ్వుతూ మనస్ఫూర్తిగా నోరు విప్పలేకపోవడానికి అనేక కారణాలున్నప్పటికీ ప్రధానమైనది నోటి దుర్వాసన.నోటినుండి దుర్వాసన వస్తుంటే పక్కనున్నవారికి మహా ఇబ్బందిగా వుంటుంది. నలుగురిలో చిన్నతనం తెచ్చే నోటి దుర్వాసన వదిలించుకునేందుకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి.  ముఖ్యంగా రాత్రిపూట మౌత్ వాష్ చేయడం మరిచిపోకూడదు. నోటిలో తేమ లేకుండే దుర్వాసన పెరిగిపోయే అవకాశం ఉంది

 నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలంటే.. రోజూ నీటిని ఎక్కువగా తీసుకుంటూ వుండాలని డెంటిస్టులు చెబుతున్నారు. నోటి దుర్వాసన రెండు, మూడు కారణాల వల్ల వస్తుంది. దంత సమస్యలు కూడా కారణం కావచ్చు. దంతాలలో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లయితే దుర్వాసన వచ్చే అవకాశంఉంది. చిగుళ్ల సమస్యలు, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం కూడా నోటి దుర్వాసనకు కారణమవుతుంది.అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.

నోటి దుర్వాసన ఇతరులకు ఇబ్బంది..


నోటి దుర్వాసన పొగొట్టే చిట్కాలు.


లవంగాలు, యాలకులు నోటిలో చప్పరిస్తూ నమిలి మింగితే నోటి దుర్వాసన పోతుంది.


వెలగ ఆకు రసంలో నిమ్మ ఉప్పు కలిపి పుక్కిలించాలి. అలాగే, పల్లేరు ఆకు రసం, తేనె కలిపి పుక్కిలించినా ఫలితం ఉంటుంది.


నోటి పూతను సులువుగా తగ్గించుకోవచ్చు. జామ ఆకులను నమిలి ఉమ్మివేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేస్తే తగ్గిపోతుంది.


లేత నేరేడు ఆకు కషాయం పుక్కిలించినా నోటి పూత తగ్గిపోతుంది.


గొబ్బి ఆకు (ముళ్ళ గోరింట) ఆకు నమిలి ఉమ్మేయాలి. అలాగే, పల్లేరు రసంలో తేనె కలిపి పూసినా నోటిపూత ఇట్టే తగ్గిపోతుంది.


పతిరోజూ ఉదయం, రాత్రి… రెండుమార్లు పళ్లు తోముకోండి.


బ్రషింగ్ తర్వాత టంగ్‌క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోండి. నాలుకపైనున్న బ్యాక్టీరియాను తొలగించుకోవడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేయండి.


చిగుళ్లపై పుళ్లు ఉన్నప్పుడు తప్పనిసరిగా డెంటిస్ట్‌ను కలిసి పరీక్షలు చేయించుకోండి.


 కొన్నిసార్లు దంతాల్లో పిప్పిపళ్లు ఉన్నప్పుడు ఫిల్లింగ్ చేయించుకోవాలి. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.


 ఆహారం సరిగా జీర్ణం కాకుండా గ్యాస్ వస్తున్నప్పుడు, సైనస్, టాన్సిల్స్ వంటివి ఉన్నప్పుడు, మధుమేహం లాంటి వ్యాధులు ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి తగిన చికిత్స తీసుకోవాలి.


నోటిని ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి. అంటే దీనర్థం మంచి నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలనే.. మరో ప్రత్యామ్నాయం ఏమిటంటే షుగర్ ఫ్రీ గమ్ నమలడం. దీనిని నమిలితే నోటిలో లాలాజలం ఊరుతుంటుంది. 


కొవ్వులేని పెరుగు తీసుకోవాలి. అంటే అన్నంలో గానీ, పంచదార కలుపుకుని కాని తినడం కాదు. ఒట్టి పెరుగును దేనిలోనూ కలపకుండా తింటే పళ్లకు పట్టిన గార, నోటి పూత తగ్గుతాయి.

జీర్ణ ప్రక్రియ సవ్యంగా జరిగితే నోరు శుభ్రంగా తయారవుతుంది. దీనికోసం అనాసకాయ ముక్కలను తినండి. దీనిలోని బ్రొమిలెయిన్ అనే ఎంజైమ్ జీర్ణ ప్రక్రియ సవ్యంగా జరిగేలా చేస్తుంది.

అలాగే పచ్చి కాయగూరలను నమిలేటప్పుడు లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది పళ్లలో ఇరుక్కున్న ఆహార పదార్ధాలను, పళ్లపై ఉన్న యాసిడ్‌ను పూర్తిగా తొలిగిస్తుంది.

దుర్వాసనను తగ్గించుకోవడానికి మౌత్ వాష్‌నో లేదా మింట్ చిక్‌లెట్స్‌నో కొనేకంటే నోటి దుర్వాసనను కలుగజేసే బాక్టీరియాను తగ్గించుకుంటే ఇబ్బంది ఉండదు. నోటిలో బాక్టీరియా తగ్గించుకోవాలంటే పైన చెప్పిన వాటిలో కొన్ని వరుసగా పాటిస్తే చాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: