ఐపిఎల్ లో రెండేళ్ల నిషేధాన్ని ముగించుకున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ 2018 ఐపిఎల్ ఆడనున్నాయి. 2015లో ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలకు గాను చెన్నై, రాజస్థాన్ ఇరుజట్ల మీద రెండేళ్ళ నిషేధం విధించారు. ఇక ఈరోజుతో ఆ గడువు పూర్తయిందని చెన్నై సూపర్ కింగ్స్ జార్జ్ జాన్ అన్నారు. ఎదురుచూపులు ముగిశాయని.. సూపర్ మార్నింగ్ లయస్ అని ట్వీట్ చేశాడు.


ఇక ఐపిఎల్ ఆటగాళ్లతో కూడా పదేళ్ల ఒప్పందం ముగిసిందని.. ఈసారి తాము కూడా వేలం వేసి ఆటగాళ్లను ఎంచుకోవాలని అన్నరు. ఒకవేళ పాత వాళ్లని ఎంచుకునే అధికారం తమకిస్తే ముందు మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనినే తీసుకుంటామని. అతని తర్వాతే ఎవరైనా అని అన్నాడు జాన్. ధోని సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఎంతో మంచి జట్టుగా ఉందని అన్నారు. అంతేకాదు 2010, 2014 ఐపిఎల్ లో ధోని జట్టు విజయం సాధించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: