విద్యార్థులు కృషి పట్టుదలతో పాటు నైపుణ్యాన్ని అలవర్చుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ. సింధు అన్నారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఓక్రిడ్జిస్కూల్‌ ఖాజాగూడ శాఖ ఆధ్వర్యంలో ఓక్‌మూన్‌-2017 సదస్సు శుక్రవారం నిర్వహించారు. సదస్సులో సింధు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమలో దాగివున్న నైపుణ్యానికి పదును పెట్టాలన్నారు. చిన్ననాటి నుంచే విద్యతో పాటు ఆటపాటల్లో రాణించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓక్రిడ్జి స్కూల్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: