ప్రపంచం మొత్తం ఇప్పుడు టెక్నాలజీ మయం..శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎప్పుడూ కొత్త పుంతలు తొక్కుతూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ అయ్యింది. తాజాగా చిన్న పిల్ల కోసం  ప్రముఖ మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల సంస్థ స్వైప్ ప్రత్యేకంగా ‘స్వైప్ జూనియర్’ పేరుతో కొత్త మోడల్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ ఫోన్లు  5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలకు ఈ స్మార్ట్ ఫోన్లు ఉపయోగపడతాయి.

‘స్వైప్ జూనియర్’ స్మార్ట్ ఫోన్స్


ఇందులో ఫీచర్ల ద్వారా పిల్లలు ఫోన్ ఎలా వినియోగిస్తున్నారో తల్లిదండ్రులు పరిశీలించవచ్చు. తల్లిదండ్రులు నియంత్రించగలిగే విధంగా సరికొత్త ఫీచర్లతో పిల్లలకు ఉపయోగపడేలా ఈ స్మార్ ఫోన్ ను రూపొందించారు.  ఈ స్మార్ట్ ఫోన్ ఈ-కామర్స్ సైట్ల ద్వారా మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. దాని ధర రూ.5,999గా నిర్ణయించారు. ఈ ఫోన్లో 2 ఎంపీ బ్యాక్ కెమెరా, 0.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 4జీబీ ఇంటర్నల్ సదుపాయం కల్పించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: