ప్రపంచం మొత్తం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మానియా పట్టుకుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ సెల్ ఫోన్ లేనిదే జీవితం అదు అన్నంత పరిస్థితికి వచ్చింది. అంతే కాదు రోజు రోజు కి సెల్ ఫోన్ లు కొత్త కొత్త ఫీచర్లతో కొత్త కొత్త డిజైన్లతో అబ్బుర పరుస్తున్నాయి. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ కొనాలంటే సామాన్య ప్రజలకు రేట్లు అందుబాటులో ఉండేవి కాదు..కానీ ఇప్పుడు మార్కెట్ లో కంపినీల కాంపిటీషన్ పెరిగిపోవడంతో స్మార్ట్ ఫోన్ల రేట్లు కూడా తగ్గుముఖం పట్టాయి.

ఈ మద్య  ‘ఆటమ్ 2ఎక్స్’ పేరిట లావా సంస్థ దేశీయ మార్కెట్‌ లోకి తక్కువ బడ్జెట్‌ లో ఓ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ ను విడుదల చేసింది.డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 4.5 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 480X854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 3జీ, బ్లూటూత్ 4.0, వైఫై, ఎ-జీపీఎస్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.4,499.



మరింత సమాచారం తెలుసుకోండి: