భారత దేశంలో ఐటీ దిగ్గజంగా పేరు పొందిన  రాజీవ్ బన్సాల్ ఇన్ఫోసిస్ కు రాజీనామా చేశారు. ఇప్పుడు  బన్సాల్ క్యాబ్ సేవల సంస్థ 'ఓలా'లో సీఎఫ్ఓగా చేరారు. ఇక జనవరి నుంచి ఆయన ఓలా లీడర్ షిప్ టీంలో చేరనున్నారని, ప్రస్తుత సీఎఫ్ఓ మితీష్ షా, బన్సాల్ టీంలో స్ట్రాటజిక్ ఫైనాన్స్ విభాగానికి అధిపతిగా ఉంటారని ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ వెల్లడించారు.  ఇన్ఫోసిస్ లో రాజీవ్ దీర్ఘకాల అనుభవం తమకెంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.

భారత్ లో ఓలా క్యాబ్ సర్వీసు మరిన్ని పట్టణాల్లో విస్తరించే యోచనలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. గత కొంత కాలంగా ఐటీ రంగంలో పని చేసిన రాజీవ్ బన్సాల్ తమకెంతో పనికొస్తారని ఆయన అనుభవంతో సంస్థ అభివృద్ది సాధిస్తుందన్న నమ్మకం తమకుందని అన్నారు.  ఫైనాన్స్ విభాగంలో రాజీవ్ బన్సాల్ 21 ఎళ్ల అనుభవం ఉందని అందులోనూ గత పదహారు సంవత్సరాలుగా  ఇన్ఫోసిస్ పనిచేశారన్నారు.

 'ఓలా' క్యాబ్


ప్రస్తుత కాలంలో  నిత్యమూ వేలాది మందికి క్యాబ్ సేవలను అందిస్తున్న సంస్థ భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విస్తరించనుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో తన పదవికి రాజీనామా చేసినప్పటికీ డిసెంబర్ వరకు సీఎఫ్ఓ, ఇన్ఫోసిస్ బోర్డుకు సలహాదారుగా ఉండేదందుకు రాజీవ్ బన్సాల్ అంగీకరించినట్లు తెలుస్తుంది. అందువల్లే ఓలాలో చేరేందుకు ఆయన జనవరి వరకూ సమయం తీసుకున్నారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: