గత కొంత కాలంగా అప్పుల ఊబిలో సతమతమవుతున్న ఎన్‌సిసి లిమిటెడ్‌ ఇప్పుడు ఆ బాధల నుంచి విముక్తి పొందడం కోసం ఎన్‌సిసి లిమిటెడ్‌ రెండు టోల్‌వే ప్రాజెక్టులను అమ్మకానికి పెట్టింది.  ఉత్తర ప్రదేశ్‌, బెంగుళూరుల్లో ఉన్న ఈ ప్రాజెక్టుల్లో ఎన్‌సిసికి 38 నుంచి 51 శాతం వాటా ఉంది. అయితే ఈ అమ్మకాల ద్వారా రూ. 200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు డబ్బులు సమకూరుతాయని వారు అనుకుంటున్నారు.

ఇకపోతే ఈ ప్రాజెక్టుల్లో న్‌సిసి వాటా కొనేందుకు మూడు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మార్చి, 2016 నాటికి ఈ చర్చలు ఒక కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు. అనుకున్న విధంగా ఈ డీల్‌ కుదిరితే ఎన్‌సిసికి ఉన్న రూ.3,800 కోట్ల అప్పుల్లో రూ.560 కోట్ల వరకు తీరే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: