ప్రపంచంలో ఎక్కడైనా ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందింది. ఇక సామాన్య మద్య తరగతి వాళ్లు కూడా ప్రతి ఒక్కరికీ అరచేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే.. అయితే గతంలో సెల్ ఫోన్ లో మాట్లాడాలంటే బిల్లుల మోత మోగేది. దీంతో టెలికాం సంస్థల మద్య పోటీ ఎక్కువైంది..ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ తక్కువ ఖర్చుతో మాట్లాడుకునే వెసులు బాటు తీసుకు వచ్చారు. తక్కువ ఖర్చుతో ఫోన్‌ కాల్స్‌ మాట్లాడే సదుపాయం కల్పిస్తున్న రింగో అప్లికేషన్‌ తాజాగా 19 పైసలకే నిమిషం పాటు దేశీయంగా కాల్స్‌ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

కాల్స్‌పై తాము వసూలు చేస్తున్న రేటు టెలికాం కంపెనీలు వసూలు చేస్తున్న చార్జీల కన్నా 90 శాతం తక్కువని ఈ సంస్థ చెబుతోంది.  మొబైల్‌ ఫోన్‌ ఆపరేటర్ల నెట్‌వర్క్‌ను ఆధారంగా చేసుకుని ఫోన్‌ కాల్స్‌ చేసుకునే సౌకర్యాన్ని ఈ యాప్‌ అందిస్తోంది. దేశీయంగా ఫోన్ కాల్స్ నిమిషానికి కేవలం 19 పైసలకే చేసుకునే వెసులుబాటు రావడంపై సంతోషవ వ్యక్తం చేస్తున్నారు కస్టమర్లు.

రింగో యాప్‌


కొత్తగా తెచ్చిన ఈ సదుపాయంతో వచ్చే మూడు నుంచి ఆరు నెలల కాలంలో పది లక్షల మంది కస్టమర్లను సంపా దించుకోవాలని కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. టెలికాం కంపెనీల ఎస్టీడీ చార్జీలు భిన్నంగా ఉంటాయని, తాము మాత్రం దేశంలోని ఏ లాండ్‌లైన్‌కు లేదా మొబైల్‌ ఫోన్‌కు చేసినా ఒకే ధరను వసూలు చేస్తామని రింగో వ్యవస్థాపకుడు, సీఈఓ భవిన్‌ తెరఖియా తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: