మార్కెట్లో 4జీ హవా మెల్లమెల్లగా పుంజుకుంటున్నప్పటికీ మన ఇంటర్నెట్ నత్తనడక నడుస్తూనే ఉంది. కానీ కాంతివేగంతో మీ ఫైళ్లను, సినిమాలను, వీడీయో గేమ్స్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోగలిగితే ఎంత బాగుంటుందో కదా. దీన్ని సుసాధ్యం చేసే కొత్త టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి వస్తోంది మరి.  మెగా బైట్లు, గిగాబైట్ల ప్రపంచంలోకి దూసుకొచ్చిన ఆ కొత్త సాంకేతిక శక్తిని లైట్ ఫిడెలిటీ (లై-ఫై) అంటున్నారు. ఇది సెకనుకు ఒక జీబీపీఎస్‌ వేగంతో పనిచేస్తుంది. అంటే మామూలుగా ఇప్పుడున్న వై-ఫై టెక్నాలజీ వేగంతో పోలిస్తే  వంద రెట్ల వేగంతో ఇది పనిచేస్తుందన్నమాట. 


ఎడింబరో విశ్వవిద్యాలయంలోని మొబైల్ కమ్యూనికేషన్స్ చైర్ పర్సన్ హరాల్డ్ హాస్ ఈ లై-ఫై ప్రాజెక్టు సృష్టికర్త. కాంతిని ఒక ఎల్ఈడీపైకి ప్రసరింపజేయడం ద్వారా సెకనులోనే జిగాబైట్ సమాచారాన్ని ఎలా పంపించవచ్చో హాస్ ఇటీవలే డెమాన్‌స్ట్రేట్ చేసి మరీ చూపించాడు. ఇప్పుడు మూడు నిమిషాల్లో పూర్తి సినిమా డౌన్‌లోడ్. దీనికంటే ఎవరయినా స్పీడ్‌గా డౌన్‌లోడ్ చేయగలిగితే జీవితకాలం సిమ్ చార్జీలు ఫ్రీ అంటూ ఎయిర్ టెల్ కంపెనీ యాంకర్ గొప్పలు పోతోంది కదా. ఈ లై-ఫై ముందు ఈ గొప్పలు ఇక పనికిరావంటున్నారు టెక్ నిపుణులు.


మరింత సమాచారం తెలుసుకోండి: