భారత దేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ది పథంలో ముందుకు సాగింది. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దేశ విదేశాల్లో భారతీయు ఉత్పత్తులకు ఆదరణ లభించింది. దీంతో భారతీయుల్లో చాలా మంది సంపన్నులుగా మారిపోయారు. ఇప్పటి వరకు ఆసియా  ఫసిఫిక్ ప్రాంతంలోని దేశాల్లో సంపన్నులు (మిలియనీర్లు) అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాల్గవ స్ధానంలో నిలిచింది.  న్యూ వరల్డ్ వెల్త్ సంస్ధ ‘ఆసియా పసిఫిక్‌ 2016 వెల్త్‌ రిపోర్ట్‌' పేరిట ఓ నివేదికను ప్రచురించింది.


అయితే ఆసియా పసిఫిక్‌ దేశాల్లో మొత్తం 35 లక్షల మంది సంపన్నులు ఉండగా, వీరి సంపద విలువ 17.7 లక్షల కోట్ల డాలర్లని పేర్కొంది.  ఈ జాబితాలో 12.60 మంది సంపన్నులతో జపాన్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 6.54 లక్షల మందితో చైనా 2వ స్థానంలో, 2.90 లక్షల మందితో ఆస్ట్రేలియా 3వ స్థానంలో నిలిచాయి.


వచ్చే పదేళ్లలో వీరి సంఖ్య మరింతగా పెరుగుతుందని, 2025 నాటికి ఈ ప్రాంతం అత్యధిక సంపన్నులు కలిగిన ప్రాంతంగా నిలుస్తుందని పేర్కొంది. 2025 నాటికి భారత సంపన్నుల జనాభా 105 శాతం పెరిగి 4.83 లక్షలకు చేరుతుందని అంచనా వేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: