తెలుగు రాష్ట్రాల్లో అపోలో హాస్పిటల్స్‌ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే..తాజాగా ఆరోగ్య బీమా సేవల వ్యాపారంలో వాటాను విక్రయిస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూపు ప్రకటించింది. అపోలో హాస్పిటల్స్‌ గ్రూపునకు చెందిన అపోలో ఎనర్జీ వైద్య బీమా సంస్థ అపోలో మ్యూనిచ్‌లో 23.3 శాతం వాటాను ఆ సంస్థ విక్రయించాలని నిర్ణయించింది. రూ.163.5 కోట్ల విలువ చేసే ఈ మొత్తం వాటాను ఆ సంస్థ భాగస్వామి జర్మనీకి చెందిన మ్యూనిచ్‌కు విక్రయించడానికి అపోలో ఎనర్జీ కంపెనీ లిమిటెడ్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.

అపోలో హాస్పిటల్స్ గ్రూపునకు చెందిన అపోలో ఎనర్జీ కంపెనీ లిమిటెడ్.. ఆరోగ్య బీమా వ్యాపారంలో పెట్టుబడులు కలిగి ఉంది. అపోలో ఎనర్జీ బోర్డు సమావేశంలో వాటా విక్రయానికి ఆమోదం లభించిందని అపోలో గ్రూపు వెల్లడించింది. వాటా విక్రయ ప్రక్రియ ఈ ఏడాది మార్చికల్లా ముగియనుంది. 2016 తొలి త్రైమాసికం ముగింపు నాటికి ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. దీంతో ఈ బీమా సంస్థలో అపోలో హాస్పిటల్స్‌ గ్రూపు వాటా 51.1 శాతానికి పడిపోనుంది.

అపోలో హాస్పిటల్స్

 

ప్రస్తుతం అపోలో గ్రూపునకు 74.4 శాతం వాటా కలిగి ఉంది. ఒప్పందం అమల్లోకి రాగానే మ్యూనిచ్‌ రె వాటా 48.7 శాతానికి చేరనుంది. మరో 0.2 శాతం ఉద్యోగులకు చెందనుంది.2007లో ప్రారంభమైన అపోలో మ్యూనిచ్ మార్కెట్ విలువ రూ.703 కోట్లకు పెరిగింది. 2015 మార్చిలో మోడీ సర్కార్‌ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. అంతక్రితం ఇది 26 శాతం పరిమితిగా ఉంది. ఎఫ్‌డిఐ పరిమితి పెంపును ఇప్పుడూ మెనిచీ, అపోలో ఉపయోగించుకున్నాయి.
 



మరింత సమాచారం తెలుసుకోండి: