గత ఏడాది ఒక్కసారిగా బంగారం రేటు పడిపోయింది..దాదాపు రూ.25,000 ల వరకు దిగివచ్చిన పసిడి రేటు ఇప్పుడు హఠాత్తుగా పెరిగిపోవడంతో మద్యతరగతి కుటుంబీకులు కంగారు పడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌కు తోడు గ్లోబల్‌ మార్కెట్ల ప్రభావంతో బంగారానికి ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. మంగళవారం 28వేల మార్క్‌ దాటి ఏడాది గరిష్ఠానికి చేరింది. రూ. 710 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ. 28,585కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,195.66 డాలర్లుగా ఉంది. దీంతో పాటు వెండి ధర కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. మంగళవారం వెండి కేజీకి రూ. 1,180 పెరిగి రూ. 37,230కు చేరింది. నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: