కంప్యూటర్ టెక్నాలజీ రోజు రోజుకీ విస్తరిస్తున్న తరుణంలో డెస్క్ టాప్ నుంచి ట్యాప్ టాప్,టాబ్లెట్ లాంటి అధునాత పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటితో మనం ఎక్కడ నుంచైనా నెట్ వర్క్ తో పనిచేసుకోవచ్చు. ప్రస్తుతం టాబ్లెట్ లను మించి సకల సదుపాయాలు స్మార్ట్ ఫోన్లలో ఉండటంతో ఈ టాబ్లెట్ అమ్మకాల జోరు తగ్గినట్లే అనిపిస్తుంది.  గతేడాది అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో భారత టాబ్లెట్‌ మార్కెట్‌లో 18.7 శాతం క్షీణత చోటు చేసుకుంది.

ఇంతక్రితం ఏడాది 2014లోనూ ఈ విభాగం అమ్మకాలు 10.1 శాతం తగ్గాయి. 2015 క్యూ4లో భారత్‌లో 8.6 లక్షల టాబ్లెట్‌ అమ్మకాలు జరిగాయని ఇంటర్నేపనల్‌ డాటా కార్పొరేషన్‌ (ఐడిసి) వెల్లడించింది. కాగా 2015లో మొత్తం టాబ్లెట్‌ మార్కెట్‌ 8.2 శాతం వృద్ధితో 38 లక్షల యూనిట్లకు చేరిందని ఆ సంస్థ పేర్కొంది. కాగా డాటావిండ్‌ 20.7 శాతం వాటాతో తొలి స్థానంలో నిలిచింది. సామ్‌సంగ్‌ 15.8 శాతం, మైక్రోమాక్స్‌ 15.5 శాతం, లెనొవో 12.8 శాతం, ఐబాల్‌ 10 శాతం చొప్పున మార్కెట్‌ వాటాతో వరుస స్థానాల్లో నిలిచాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: