ప్రపంచం మొత్తం సెల్ ఫోన్ మయం అయ్యింది..ప్రతి సామాన్యుడి చేతిలో ఖచ్చితంగా సెల్ ఫోన్ ఉంటుంది. గతంలో కాస్త డబ్బులున్న వారే ఖరీదైన సెల్ ఫోన్లు అన్ని ఫీచర్లు ఉన్ సెల్ ఫోన్లు వాడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.. స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరలకే రావడంతో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు కొనడం మొదలు పెట్టారు..ఇంకేముంది ప్రపంచం అరచేతిలో ఉన్నట్లే లెక్క. అయితే ఇప్పటి వరకు ధనికులకే పరిమితమైన  ఐఫోన్ ఇప్పుడు  సామాన్యుడికి సైతం అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో ఐఫోన్ కంపెనీ 5ఎస్ఈని తయారు చేసింది.

ఇప్పుడు ఈ పోన్ విడుదలకు సిద్ధమవుతుంది. నేడు రాత్రి 10 గంటలకు విడుదల చేస్తామని చెప్పిన కంపెనీ ఈ రోజు విడుదచేస్తున్నట్లు సమాచారం.ఐఫోన్‌ 5ఎస్‌ఈ 4 అంగుళాల పరిమాణంలో రానుంది. ఎస్‌ఈ అంటే స్పెషల్‌ ఎడిషన్‌ లేదా 5ఎస్‌ ఎన్‌హెస్‌డ్‌గా భావిస్తున్నారు.

సరికొత్త ఏ9 ప్రాసెసర్‌తో పాటు 12 మెగాపిక్సెల్‌ కెమెరా, 4కే వీడియోలు చూడగలిగే పరిజ్ఞానం, లైవ్‌ ఫోటోస్‌ సదుపాయం ఉండనుంది. 16జీబీ, 64జీబీ అంతర్గత మెమొరీ కలిగి ఉంటుంది.  ఐఫోన్‌ 5ఎస్‌ఈతో పాటు ఐపాడ్‌ ఎయిర్‌3, యాపిల్‌ బాండ్‌, ఐఓస్‌ 9.3లను ఈ ఈవెంట్‌లో యాపిల్‌ సంస్థ ఆవిష్కరిస్తుందని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: