ఎటువంటి సంస్థ విజయానికైనా నియామకాల ప్రక్రియ అనేది చాలా కీలకం. నైపుణ్యం, అద్భుత ప్రతిభ కలిగిన వారిని ఒడిసి పట్టుకుంటే చాలు సంస్థ తలరాతే మారిపోతోంది. అయితే ఇదే సమయంలో నియామక ప్రక్రియలోని కొన్ని తప్పిదాలు సంస్థ ప్రగతిపై ప్రభావం చూపుతాయని టైమ్స్ జాబ్స్ డాట్ కామ్ చెబుతోంది. ఈ వెబ్ సైట్ చేపట్టిన సర్వే ప్రకారం భర్తీ చేయాల్సిన స్థానానికి అర్హులైన వారిని తీసుకోవడం లేదని 62 శాతం మంది నియామక మేనేజర్లు, నియామకవేత్తలు ఒప్పుకున్నారు.

 

*నైపుణ్యంతో సంబంధం లేకుండా వేతన ప్యాకేజీకి ఆ ఉద్యోగార్ధిసరిపోతే చాలు.. కొలువులు కల్పించడం కంపెనీలు చేస్తున్న మరో తప్పిదమని సర్వే స్పష్టం చేసింది.

 

*నైపుణ్యం కంటే సీటీసీ(వేతన ప్యాకేజీ)కి అధిక ప్రాధాన్యం ఇస్తామని దాదాపు 60శాతం మంది నియామక మేనేజర్లు ఒప్పుకున్నారని సర్వే వెల్లడించింది. కంపెనీ బడ్జెట్ కు లోబడి నియామకాలు చేపట్టేందుకు ఒత్తిడి ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని తెలిపింది.

 

* సర్వే చేసిన 55 శాతం సంస్థల్లో ఉద్యోగ అర్హతలను కంపెనీలు స్పష్టంగా ప్రకటించకపోవడం మరో తప్పిదమని వెల్లడించింది.

 

*ఉద్యోగ నియామకంలో కాలం చెల్లిన పద్ధతులు పాటించడం(46 శాతం), సరైన దృక్పథం కలిగిన వారిని ఎంపిక చేయకపోవడం (40శాతం) మరికొన్ని సాధారణ తప్పిదాలని సర్వే చెప్పింది.

 

*70 శాతం నియామక మేనేజర్లు పరిచయాక్ వ్యక్తులు(రిఫరెన్స్) ధృవీకరణ ముఖ్యమని తెలపగా..58 శాతం మంది మాత్రమే ప్రతి అభ్యర్థి పరిచయ వ్యక్తులను ధృవీకరిస్తున్నారు.

 

*20-30 శాతం అభ్యర్థులు సమర్పిస్తున్న రిఫరెన్సులు నకిలీవేనని పరిశీలన అనంతరం 10-20 శాతం దరఖాస్తులను తిరస్కరిస్తున్నామని వెల్లడించారు.

 

అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో కంపెనీలు ఎటువంటి పైరవీలకు తావులేకుండా, కేవలం శక్తి సామర్థ్యాలను, తెలివితేటలను మాత్రమే పరిగణలోకి తీసుకొంటే ఆ కంపెనీ అత్యుత్తమ స్థాయికి చేరుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: