భారత దేశంలో నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశ పెడుతున్నారు. ముఖ్యంగా స్వచ్ఛభారత్ లాంటి సామాజిక పథకానికి యావత్ భారత దేశం స్పందించింది. చెత్తపై సమరభేరి మోగించారు..సెలబ్రెటీలు, స్వచ్చంద సంస్థలు ఇలా అందరూ ముందుకు వచ్చారు. దీని తర్వాత డిజిటల్ ఇండియా అంటూ కొత్త టెక్నాలజీకి స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ కి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు..ముఖ్యంగా కమ్యూనికేషన్ పరంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

ఇప్పుడు అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి..సమాచార వ్యవస్థ మొదలైనప్పటి నుంచి బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సేవలు అందిస్తుంది. తాజాగా రూ 50 లకే 20 జిబి ఇంటర్‌నెట్ ఆఫర్ చేస్తున్న బిఎస్ఎన్ఎల్ ఇండియాలో ఉన్న వినియోగాదారులు డేటా షేర్ చేసుకొనే సౌలభ్యం . ప్రభుత్వరంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఒక అద్బుతమైన ఇంటర్‌నెట్ పేకేజ్ ను విడుదల చేసింది.  

ఈ పధకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రవేశపెడుతునారు. ఈ ఆఫర్ తో మొబైల్ డాటా వినియోగించే వారికి కళ్ళు చెదురుతున్నాయి. సాదారణంగా మిగాతా సర్వీస్ ప్రొవైడర్లు రూ 200 లకు 1 జిబి డాటాను ఇస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ 20 రెట్ల డాటాను కేవలం 1/4 ధరకే అందిస్తుండడంతో వినియోగదారులు విస్మయం చెందుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: