భారత దేశంలో పండగలకు, వివాహాది శుభకార్యాలకు బంగారం విరివిగా కొంటారు. అయితే ఇలాంటి సందర్భమే సంవత్సరానికి ఒకసారి వస్తుంది అదే అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ అనేది భారతీయుల సెంటిమెంట్..ఆ రోజు బంగారం కొంటే సకల సంపదలు తమ వెంట ఉంటాయని అంటారు. అంతే కాదు ఆరోజు బంగారం షాపులు కిట కిటలాడుతుంటాయి. కానీ ఈ రోజు అక్షయ తృతీయ అయినప్పటికీ బంగారం షాపుల్లో పెద్ద సందడి కనిపించలేదు..కారణం ఈ మద్య బంగారానికి విపరీతమైన ధర పెరిగిపోయింది. పవిత్రమైన అక్షయ తృతీయ రోజు అంచనాలకు అనుగుణంగా వ్యాపారం జరగలేదు.

అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండడంతో విలువైన యొల్లో మెటల్ మార్కెట్ లో మెరుపులు మాయమయ్యాయి. ఒక దశలో పసిడి 250 రూ.ల నష్టపోయి 10గ్రా. ధర 30,100 దగ్గర స్థిరంగా ట్రేడయిన పసిడి ధరలు ఆతర్వాత 30 వేల మార్క్ దిగువకు పడిపోయాయి. 389 రూపాయలను కోల్పోయి 29, 989 స్థాయిని నమోదు చేసింది. గత నెల 29 తర్వాత ముహూర్తాలు లేకపోవడం బంగారం ధరలు పతనానికి దారితీసింది  అంతే కాదు  పెళ్ళిళ్ళ సీజన్ లేకపోవడం ఒక కారణం చెప్పవొచ్చు.  ప్రస్తుతం మూఢం నడుస్తున్నందున, భారీ కొనుగోళ్లు ఆశించలేమని వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

అటు పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారులనుండి డిమాండ్ తగ్గడంతో వెండి కూడా బలహీనంగానే ట్రేడ్ అవుతోంది.అటు పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారులనుండి డిమాండ్ తగ్గడంతో వెండి కూడా బలహీనంగానే ట్రేడ్ అవుతోంది. దాదాపు కిలో రూ 350 క్షీణతతో రూ 41, 200 దగ్గర ఉంది. గ్లోబల్ గా పసిడి ధరలను ప్రభావితం చేసే సింగపూర్ మార్కెట్ లో బంగారం 0.7 శాతం, వెండి అరశాతం మేర ధరలు పడిపోయాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: