ప్రస్తుతం ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీ తో మనిషికి సాద్యం కాని పనులు అంటూ ఏవీ లేవు. కమ్యూనికేషన్ పరంగా ఎంతో దూసుకు వెళ్తున్నారు. ప్రస్తుతం కంప్యూటర్, ల్యాప్ టాప్ పరంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి.  ఇక బిజినెస్ పరంగా ఈ కంప్యూటర్ టెక్నాలజీ సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా ల్యాప్ టాప్ తో సోషల్ మాద్యమాల ద్వారా ఔత్సాహికులు ఆన్ వ్యాపారలకు అనుగుణంగా మార్కెట్ లోకి  చీపెస్ట్ లాప్ టాప్ విడుదలైంది. సాఫ్ట్ వేర్ దిగ్గజం ఐ బాల్ పది వేల రూపాయల లోపే విండోస్ లాప్ నుభారత్ లో విడుదల చేసింది.

దీన్ని ప్రస్తుతానికి రెండు వేరియంట్లలో విక్రయించనుంది. ఐబాల్ కాంప్ బుక్ ఎక్సలెన్స్ ధర కేవలం రూ. 9.999 మాత్రమే. ఐబాల్ కాంప్ బుక్ ఎక్జెంప్లేయర్ ధర రూ. 13,999గా నిర్ణయించింది. ఇక దీని ఫిచర్స్ విషయానికి వస్తే.. ఎక్సలెన్స్ స్క్రీన్ 11.6 ఇంచులు (1366 x 768 పిక్సెల్) కాగా ఎక్జెంప్లేయర్ స్క్రీన్ 14 ఇంచులు (1366 x 768 పిక్సెల్).
ఇక ఈ రెండు లాప్ టాప్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తాయి.

ఐబాల్ కాంప్ బుక్ ఎక్సలెన్స్ ధర కేవలం రూ. 9.999 మాత్రమే


రెండింటికి ఇంటెల్ ఆటమ్ జడ్ 3735 ఎఫ్ ప్రాసెసర్ బిగించారు. రెండింటికీ వీజీఏ కెమెరాతో కూడిన వెబ్ క్యామ్ సౌకర్యం ఉంది. ఇంటర్నల్ స్టోరీజీ 32 జీబీ కాగా మైక్రో ఎస్.డి. కార్డు స్లాట్ కూడా ఇచ్చారు. దీంతో 64 జీబీ వరకు మెమొరీ పెంచుకోవచ్చు. రెండింటికీ 10 వేల ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీంతో 8.5 గంటలు నిరంతరాయంగా ఉపయోగించుకోవచ్చని, స్టాండ్ బై సామర్థ్యం 25 గంటలని ఐబాల్ చెబుతోంది.

ల్యాప్ టాప్ ఆవిష్కరిస్తున్న యాజమాన్యం

iBall launches CompBook laptop sub-brand  in India, starting at Rs 9,999

హెడ్ ఫోన్, మైక్ కోసం 3.5 ఎం.ఎం. జాక్ కూడా ఇచ్చారు. వెనుక వైపు రెండు స్పీకర్లు ఉండడంతో ఆడియో కోసం ప్రత్యేకంగా స్పీకర్లు అమర్చుకోవాల్సిన అవసరం ఉండదని కంపెనీ వివరిస్తోంది. ఇక కనెక్టివిటీ కోసం వైఫై, బ్లూటూత్, హెచ్.డి.ఎం.ఐ. పోర్ట్, రెండు యు.ఎస్.బి. 2.0 పోర్ట్ లు ఇచ్చారు. రెండు లాప్ టాప్ లకు ఏడాది వారంటీ ఇస్తున్నట్లు ఐబాల్ ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: