తన (6)  అనుబంధ  బాంకు లైన స్టేట్ బాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బాంక్ ఆఫ్ బికనేర్ & జైపూర్, స్టేట్ బాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బాంక్ ఆఫ్ పాటియాల, స్టేట్ బాంక్ ఆఫ్ ట్రావంకూర్ & భారతీయ మహిళా బాంకు (2013 లోనే ప్రారభమైనది-ఇప్పుడు 100 శాఖలు కలిగిఉంది )  తనలో విలీనం చేసుకోవటానికి  స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా  తన బోర్ద్ అప్రూవల్ తో పాటు తన అనుబంధ బాంకుల బోర్డుల అంగీకారనికి సంబంధించిన తీర్మాన పత్రాలను కేంద్రప్రభుత్వ పరిశీలనకు తద్వారా ఈ కార్యక్రమాన్ని 2016-17 ఆర్ధిక సంవత్సరములోనే పూర్తిచేయాలనే ప్రతిపాదనను మంగళవారం నాడు (17 .05.2016) పంపించింది.




ఇది విజయవంతమైతే స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా పరిమాణం అమాంతం 37% పెరిగి కనీసం 1% డిపాజిట్ సేకరణ వ్యయం తగ్గుతుందని అంచనావేశారు ఎస్ బి ఐ చైర్పర్సన్ అరుందతీ భట్టాచార్య. ఈ ప్రక్రియ ప్రస్తుతానికి ప్రారంభ దశలోనే ఉన్నా ప్రభుత్వం ఓకె అన్న మరుక్షణమే వేగవంతమై "సంయుక్త బాలన్సు షీట్"  2017 మార్చ్ 31 కే రాగలదని నమ్ముతున్నారు. దానికి తగ్గట్టే షేర్లలో కదలికలు మొదలయ్యాయి 0.17% నష్టం తో ఎస్.బి.ఐ; 13% లాభంతో ఎస్.బి.ఎం: 10% లాభంతో ఎస్.బి.టి: 3% ఎస్ బి బి జె స్పందించాయి.


ఏఐబిఈఏ - కార్యదర్శి- సిహెచ్ వెంకటాచలం


 

ఆల్ ఇండియా బాంక్ ఎంప్లాయీస్ అస్సోసీషన్ (ఏఐబిఈఏ) కార్యదర్శి మాతృ సంస్థ అహంకార పూరిత వైఖరికి, ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరెఖంగా ఈ నెల 20 న సమ్మే చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని స్వతంత్ర & ఉద్యోగుల డైరెక్టర్లు కూడా నిర్దాక్షిణ్యంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతిపాదన గత మార్చ్ 23. ఏప్రిల్ 25 న ఆర్ధిక మంత్రి ప్రతిపాదనకు వ్యతిరెకంగా ఉందని-అనుబంధ బాంకులు ఎస్.బి.ఐ లో కాకుండా తమలో తాము మెర్జ్ అవ్వాలని కొరారు. కాని ఎస్.బి.ఐ మాత్రం తన అనుబంధ బాంకులపై వత్తిడి తెచ్చి ఈ నిర్ణయాన్ని తమపై రుద్దిందని ఉద్యోగవర్గాల సంయుక్త సంఘాలు అరోపిస్తున్నాయి. ఇది పురోగమిస్తే మిగతా బాంకుల లో కూడా ఇలా జరిగిగే అవకాశముండతం వలన బాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టే అవకాశముందని సూచనలు అందుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: