సెల్ ఫోన్ రంగంలో కొత్త కొత్త మార్పులు వస్తున్న తరుణంలో ఇంటెక్స్ సంస్థ ’క్లౌడ్ స్ట్రింగ్ హెచ్‌డి’ పేరిట 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసింది.  ఇప్పటికే తక్కువ ధరలతో ఇంటెక్స్ సంస్థ ఎన్నో ఫోన్లు విడుదల చేసింది. సామాన్యుడికి అందుబాటు ధరలో ఈ సంస్థ సరికొత్త ఫీచర్ తో  ’క్లౌడ్ స్ట్రింగ్ హెచ్‌డి’ పేరిట 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్ లోకి తీసుకు వచ్చింది.

ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధరను సంస్థ రూ.5,599గా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్ సైట్ ద్వారా వినియోగదారులు ఈ ఫోన్‌ను కొనుగొలు చేయవచ్చని అధికారులు తెలిపారు.


ఈ ఫోన్ ఫీచర్లు :


5 ఇంచుల హెచ్‌డి టచ్ స్క్రీన్


ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్


1.3 జిహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెస్సర్, 1 జిబి ర్యామ్


8జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 32 జిబిల వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు


8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా విత్ ఎల్‌ఇడి ఫ్లాష్


5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా


డ్యూయేల్ సిమ్‌లు, 4జి సపోర్టెడ్


2200 ఎంఎహెచ్ బ్యాటరీ



మరింత సమాచారం తెలుసుకోండి: