మంచి కెమెరా.. అన్ని యాప్‌లు.. సరికొత్త ఫీచర్లున్న ఓ స్మార్ట్‌ఫోన్‌ కొనాలంటే కనీసం రూ.10వేలైనా పెట్టాల్సిందే. అంత డబ్బు ఇప్పుడు లేదే అనుకుంటున్నారా.. అయితే ఒక నెల ఆగండి.. అన్ని ఫీచర్లున్న మంచి స్మార్ట్‌ఫోన్‌ ధర సగానికి సగం తగ్గి అందుబాటులోకి రానుంది. అవునండి.. నెలరోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ ధరలు తగ్గేస్తాయట. ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.



సమీప భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్ ధరలు సగానికి సగం వరకూ తగ్గుతాయని యూకే కేంద్రంగా నడుస్తున్న మ్యాజిక్ మ్యాగ్ పై డాట్ కామ్, తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. ఇందుకు ఎంతో సమయం పట్టదని, మరో నెల రోజుల్లోనే స్మార్ట్ ఫోన్ల ధరలు 50 శాతం వరకూ తగ్గనున్నాయని పేర్కొంది. మార్కెట్లోకి విడుదలయ్యే కొత్త కార్ల విలువ ఏడాదిలో 20 శాతం వరకు తగ్గుతూ ఉంటే, స్మార్ట్ ఫోన్ల విలువ 65 శాతం దిగజారుతోందని అధ్యయనం తరువాత మ్యాజిక్ మ్యాగ్ పై డాట్ కామ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 


ఒక్క ఐఫోన్ విలువ మాత్రమే కొంత మెరుగైన స్థితిలో ఉందని, మిగతా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత ఫోన్లన్నీ శరవేగంగా విలువను కోల్పోతున్నాయని తెలిపింది. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండటం, ఒకసారి మోల్డింగ్ తయారైన తరువాత, ఇబ్బడి ముబ్బడిగా స్మార్ట్ ఫోన్లు తయారు కానుండటమే ధరల పతనానికి దోహదపడుతోందని అంచనా వేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: