సెల్ ఫోన్ అనగానే ఒకప్పుడు నోకియా లేదా స్యామ్ సంగ్ మరీ కాస్త ఎక్కువ ఖరీదు చేసేవారైతే సోనీ ఎరిక్ సన్ లాంటి వాడేవారు..కానీ రాను రానూ సెల్ ఫోన్ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది..ముఖ్యంగా రియలన్స్ కంపెనీ వారు సెల్ ఫోన్ల ఆఫర్ ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి సామాన్యుడికి సైతం సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. సెల్ ఫోన్ అంటే రెండు వేల‌కు పైన‌, కాలింగ్ రేట్లు ఇన్ క‌మింగ్‌, ఔట్ గోయింగ్ కాల్స్ నిమిషానికి రెండు రూపాయ‌లున్న‌ప్పుడు ఇన్ క‌మింగ్ ఫ్రీ చేసింది రిల‌య‌న్స్‌. హ్యాండ్ సెట్ తో స‌హా 500 ల‌కే ఫోన్ అందించి అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. రిల‌య‌న్స్ జియో పేరుతో మూడు నెల‌లు 4జీ సేవ‌లు అది కూడా హై స్పీడ్ తో ఫ్రీగా అందిస్తుండ‌టం సంచ‌ల‌నానికి కేంద్ర‌బిందువైంది.

ఇప్ప‌టి కే ఎమ్మెన్సీ కంప‌నీల‌కు ట్ర‌య‌ల్ ఆఫ‌ర్ ఇచ్చింది. రిటైల్ లో కూడా ఫ్రీ సిమ్ ల‌ను మార్కెట్ లోకి విడుద‌ల చేసింది.  మీ వద్ద  4జీ స్మార్ట్‌ఫోన్ ఉందా? ఇంకేం ఎంచక్కా 90 రోజులపాటు అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్ ఎంజాయ్ చేయండి. టెలికం మార్కెట్లో పెను సంచలనానికి రిలయన్స్ జియో తెరతీసింది. ఇప్పటి వరకు కొందరికే పరిమితమైన జియో ప్రివ్యూ ఆఫర్ ఇక నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది.

4జీ స్మార్ట్‌ఫోన్ ఉన్న కస్టమర్లు ఎవరైనా జియో సిమ్‌ను ఉచితంగా తీసుకోవచ్చు. 90 రోజులపాటు అపరిమితంగా జియో సేవలను ఉచితంగా పొందవచ్చు. ఈ నిర్ణ‌యం టెలికం కంప‌నీల‌కు షాక్ నిచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: