హార్లీ డేవిడ్ సన్.. ద్విచక్ర వాహనాల మీద ఇష్టం  , మోజు ఉన్నవారు జీవితం లో ఒక్కసారి అయినా ఈ బండి కొని వాడాలి - నడపాలి అనుకుంటారు. ఈ బైక్ తయారీ నుంచీ మార్కెట్ లోకి వచ్చే వరకూ ఖర్చు ఎంత అవుతుందో తెలీదు కానీ బ్రాండ్ పేరు చెప్పి మాత్రం లక్షల్లో డబ్బు గుంజుతారు. ప్రస్తుతం ఈ సంస్థ ఇబ్బందులు ఎదుర్కుంటోంది. వాతావరణ కాలుష్యానికి కారణం అయ్యే సూపర్ ట్యూనర్ అనే పరికరాన్ని ఈ బైక్ లో వాడడం వలన పర్యావరణానికి తీవ్రమైన హాని జరుగుతోంది అని నిరూపణ అయ్యింది. దీంతో అమెరికా లో పర్యావరణ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీన్ని విచారించిన  కోర్టు ఆగస్ట్ 26 లోగా ఈ బైక్ లు వాడడం ఆపెయ్యాలి అని తీర్పుని ఇచ్చింది. ఇదే కాకుండా 12 మిలియన్ డాలర్ ల జరిమానా కూడా విధించింది. 2008 నుంచీ అమెరికా లో హార్లీ డేవిడ్ సన్ ద్విచక్రవాహనాల అమ్మకం నడుపుతోంది. ఈ వాహనాల్లో ఎప్పటి నుంచో ట్యూనర్ ని పెట్టాం అని సంస్థ ఎప్పుడో ప్రకటించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: