ఇండియా లో వడ్డీ రెట్ల విషయం లో రెండు శాతం వరకూ తగ్గితే చిన్న  - మధ్య తరహా పరిశ్రమలకి సులభ రుణాలు లభించడం తేలిక అవుతుంది అని తద్వారా అవి అభివృద్ధి బాటలో పయనం చేస్తాయి అని వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయ పడ్డారు. రేపో రేటు గనక 200 బేసిస్ పాయింట్స్ తగ్గితేనే సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమలకి లభ్ది చేకూరుతుంది అని ఆమె వివరించారు. ప్రస్తుతం భారత్ లో ఇబ్బందికర స్థాయి లో వడ్డీ రేట్ లు ఉన్నాయి అని ఇదే ప్రధాన సమస్య అని అందుకే ఎగుమతులు తీవ్రంగా తగ్గుతున్నాయి అన్నారు. " ఈ ఎగుమతులు తగ్గడం వెనకాల వడ్డీరేట్ ల ప్రభావం తీవ్రంగా ఉంది. ఉద్యోగాల్లో కోతలు కనిపిస్తున్నాయి. నిధుల సమీకరణ కూడా చాలా కష్టంగా ఉంది. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తెచ్చుకునే డబ్బుకు చెల్లించే వడ్డీ రేటు తగ్గడం వలన కంపెనీలు త్వరగా ప్రొడక్షన్ చేసి అభివృద్ధి లోకి ఒస్తాయి అది తేలికపాటి ఎగుమతుల పెంపుకి తోడ్పతుంది " అన్నారు ఆమె. 


మరింత సమాచారం తెలుసుకోండి: