ఇప్పుడు ఎక్కడ చూసినా రిలయన్స్ జియో సిం గురించే మాట్లాడుకుంటున్నారు. తొంభై రోజుల వాలిడిటీ లో అన్ లిమిటెడ్ యాక్సిస్ , బ్రౌజింగ్ తో సాగుతున్న రిలయన్స్ జియో సిమ్ కొనడం కోసం జనం ఎగబడుతున్నారు. తీరా ఈ సిమ్ తమ ఫోన్ కంపాటబులిటీ కి సెట్ అవ్వక ఊరుకుంటున్నారు జనాలు. అయితే ఒకపక్క ఉచితం అనే మాట జనాలని లాగుతోంది, అలాగే ఈ సిమ్ కోసం కొత్త ఫోన్ లు కొనే పరిస్థితిలో వాళ్ళు లేరు. సో ఇలా కాకుండా కొత్త తరహా గా కూడా ఈ ఫోన్ ని ఎలా యూజ్ చేయచ్చో చెప్తాం చూడండి. మొదట మీ ఫోన్ లో 4జీ స్మార్ట్ లో ప్లే స్టోర్ కి వెళ్లి మై జియో యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చెయ్యండి. ఆ తరవాత గెట్ జియో సిం అనే బ్యానర్ కనిపిస్తుంది దాన్ని టచ్ చేసి టర్మ్స్ అండ్ కండీషన్స్ కి అంగీకారం తెలపండి. మనం ఉన్న లొకేషన్ ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ నొక్కిన తరవాత ఒచ్చిన ఒక కోడ్ ని విడిగా ఒక పేపర్ మీద రాసుకోండి. దాన్ని దగ్గరలో ఉన్న ఒక రిలయన్స్ స్టోర్ కి వెళ్లి మీ పాస్ పోర్ట్ సైజు ఫోటో, ఆధర్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ లతో కాపీ లని అందిస్తే జియో సిమ్ ఇచ్చేస్తారు. ఇప్పటికే వేలాది యువత ఈ సిమ్ కార్డ్ ల కోసం విపరీతంగా ఎదురు చూస్తూ , రిలయన్స్ స్టోర్స్ దగ్గర క్యూ కడుతున్న నేపధ్యం లో వారికి ఈ రకంగా సిమ్ లు పొందడం తేలిక అని చెప్పండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: